గుడ్ న్యూస్.. తగ్గనున్న బ్యాంకింగ్ సర్వీస్ ఫీజులు..!!

- February 20, 2026 , by Maagulf
గుడ్ న్యూస్.. తగ్గనున్న బ్యాంకింగ్ సర్వీస్ ఫీజులు..!!

రియాద్ః సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) గుడ్ న్యూస్ చెప్పింది. తగ్గించిన సర్వీస్ ఫీజులు ఫిబ్రవరి 20 నుండి అమల్లోకి  వస్తాయని ప్రకటించింది. బ్యాంకింగ్, ఫైనాన్సింగ్ మరియు చెల్లింపు సేవల  కస్టమర్ ఫీజులపై విస్తృత తగ్గింపులు మరియు పరిమితులను విధించినట్లు తెలిపింది. సవరించిన ఫీజులు బ్యాంకులు మరియు చెల్లింపు కంపెనీలతో సహా అన్ని ఆర్థిక సంస్థలకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. నిబంధనలకు లోబడి సేవలకు విలువ ఆధారిత పన్ను (VAT) ఈ రుసుములలో ఉండదని క్లారిటీ ఇచ్చింది. ఇకపై అన్ని రుసుములను బహిరంగంగా ప్రదర్శించాలని సూచించింది.  
అదే సమయంలో కొత్తగా కొన్ని ఫైనాన్సింగ్ ఉత్పత్తులకు ఫీజులను విధించనున్నారు.  పరిపాలనా ఫీ, మడా కార్డుల పునఃజారీ ఫీ, అంతర్జాతీయ కొనుగోళ్లు మరియు నగదు ఉపసంహరణలు, బ్యాంకు అకౌంట్లు మరియు ఇ-వాలెట్ల నుండి డబ్బు బదిలీలకు ఫీ మరియు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) నెట్‌వర్క్‌లోని పాయింట్-ఆఫ్-సేల్ టెర్మినల్స్‌లో మడా కార్డులను ఉపయోగించడంపై కొత్తగా ఫీజులు విధించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com