యాంటీ బయాటిక్ మందుల వినియోగంలో అప్రమత్తం : మోదీ

- July 31, 2016 , by Maagulf
యాంటీ బయాటిక్ మందుల వినియోగంలో అప్రమత్తం : మోదీ

మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పలు అంశాలపై ప్రజలతో ముచ్చటించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కలలను సాకారం చేయాలంటే శాస్త్రసాంకేతిక రంగాలలో అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా మోదీ అన్నారు. నిత్యజీవితంలో ఉపయోగపడే విదంగా సాంకేతికాభివృద్ధి ఉండాలని సూచించారు. ప్రభుత్వం 'అటల్ ఇన్నొవేషన్ మిషన్' కార్యక్రమం ద్వారా సాంకేతిక రంగంలో సృజనాత్మకతను ప్రోత్సహిస్తుందన్నారు.రైతులు కలపనిచ్చే మొక్కల పెంపకంపై దృష్టి పెట్టాలని మోదీ సూచించారు. దీని ద్వారా కలపను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం ఉండదని తెలిపారు. అలాగే, దేశప్రజలు యాంటీ బయాటిక్ మందుల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డాక్టర్లు సూచించకుండా యాంటీ బయాటిక్స్ వాడొద్దని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com