'జాగ్వార్' సినిమా టీజర్..
- July 31, 2016
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్ హీరోగా తేరంగేట్రం చేస్తున్న చిత్రం 'జాగ్వార్'. రూ. 75 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. బాహుబలి, భజరంగి భాయ్‌జాన్ చిత్రాలతో ప్రపంచమంతటా సంచలనం సృష్టించిన కథా రచయిత విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించారు. బాలకృష్ణతో 'మిత్రుడు' తీసిన ఎ. మహదేవ్ ఈ చిత్రానికి స్క్రిప్ట్, మాటలు, దర్శకత్వం చేస్తున్నారు. థమన్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రామజోగయ్యశాస్త్రి ఈ చిత్రానికి పాటలు రాశారు. చెన్నాంబిక ఫిలింస్ పతాకంపై అనితా కుమారస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీప్తి కథానాయకిగా నటిస్తున్నారు. ఇందులో జగపతిబాబు విలక్షణమైన పాత్రను పోషిస్తుండగా, రమ్యకృష్ణ ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







