'జాగ్వార్‌' సినిమా టీజర్‌..

- July 31, 2016 , by Maagulf
'జాగ్వార్‌' సినిమా టీజర్‌..

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ హీరోగా తేరంగేట్రం చేస్తున్న చిత్రం 'జాగ్వార్‌'. రూ. 75 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. బాహుబలి, భజరంగి భాయ్‌జాన్‌ చిత్రాలతో ప్రపంచమంతటా సంచలనం సృష్టించిన కథా రచయిత విజయేంద్రప్రసాద్‌ ఈ చిత్రానికి కథ అందించారు. బాలకృష్ణతో 'మిత్రుడు' తీసిన ఎ. మహదేవ్‌ ఈ చిత్రానికి స్క్రిప్ట్‌, మాటలు, దర్శకత్వం చేస్తున్నారు. థమన్‌ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రామజోగయ్యశాస్త్రి ఈ చిత్రానికి పాటలు రాశారు. చెన్నాంబిక ఫిలింస్‌ పతాకంపై అనితా కుమారస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీప్తి కథానాయకిగా నటిస్తున్నారు. ఇందులో జగపతిబాబు విలక్షణమైన పాత్రను పోషిస్తుండగా, రమ్యకృష్ణ ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com