రవిబాబు సరికొత్త కాన్సెప్టుతో..
- July 31, 2016
తెలుగు నటుడు, దర్శకడు రవిబాబు.... నటనలో తనదైన విలక్షణత్వం, దర్శకత్వంలోనూ భిన్నత్వం చాటుతూ తనదైన స్టైల్ లో సినిమాలు తీస్తూ దూసుకెలుతున్నారు. రెగ్యులర్, రోటీన్ సినిమాలకు భిన్నంగా చేయడం ఆయన స్టైల్.. అందుకే ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.విచిత్రమైన కాన్సెప్టుతో రవిబాబు తీసే సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఎందులో అయినా గెలుపోటములు సహజం అయినట్లే...ఆయన తీసిన కొన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి కూడా. త్వరలో రవిబాబు సరికొత్త కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ప్రస్తుతం ఆయన ఓ పంది పిల్ల ప్రధాన పాత్రలో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం 'అదుగో' అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. 5 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రవిబాబే స్వయంగా ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై తీస్తున్నారు. సురేష్ బాబు సమర్పణలో ఈ సినిమా రాబోతోంది.అయితే రవిబాబు సాహసం చూసి.... కొందరు ఆందోళన చెందుతున్నారు, మరికొందరు మాత్రం ఆయన సక్సెస్ సాధిస్తారని నమ్ముతున్నారు. ఈ చిత్రంలో కొత్తవారైన అభిషేక్, నాభ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు..
ఈ చిత్రాన్ని సురేష్ బాబు సమర్పిస్తున్నారు. కేవలం గ్రాఫిక్స్ కోసమే 2 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారని తెలుస్తోంది.హాలీవుడ్ నుంచి యానిమ్యాట్రిక్స్ టెక్నాలజీని తీసుకొచ్చి సినిమా చేశాడు రవిబాబు. ఇప్పుడు వీఎఫ్ఎక్స్ కోసం భారీ ఖర్చు పెడుతున్నాడు.అదుగో చిత్ర షూటింగ్ కోసం 40 రోజుల్లో పూర్తి చేసారు. గ్రాఫిక్స్ వర్క పూర్తవ్వడానికి 4 నెలలు సమయం పడుతుందట.మరి పందిపిల్లని నమ్ముకొని రవిబాబు ఈ రేంజ్ లో సినిమా తీస్తున్న ఆయనకు బెస్టాఫ్ లక్ చెబుదాం.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







