బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!

- February 23, 2026 , by Maagulf
బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!

మనామాః బహ్రెయిన్ కు చెందని ఓ పడవపై పైరట్స్ దాడి చేశారు. ఆ సమయంలో పడవలో ముగ్గురు సిబ్బంది ఉన్నారు.   ఉత్తర సముద్ర సరిహద్దు సమీపంలో బహ్రెయిన్ నౌకను పైరేట్స్ లక్ష్యంగా చేసుకున్నారని బహ్రెయిన్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది. సమాచారం అందగానే తక్షణ చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. పైరట్స్ పడవను ఒమన్ ప్రాదేశిక జలాల్లోకి తీసుకెళ్లి అందులోని వస్తువులను చోరీ చేశారని పేర్కొన్నారు. దాదాపు మూడు గంటల తర్వాత పడవను, సిబ్బందిని వదిలేయడంతో వారంతా సురక్షితంగా చేరుకున్నారని పేర్కొంది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కోస్ట్ గార్డ్ తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com