పెళ్ళి చూపులు 10 కోట్ల వరకు వసూలు చేయవచ్చని అంచనా...

- July 31, 2016 , by Maagulf
పెళ్ళి చూపులు 10 కోట్ల వరకు వసూలు చేయవచ్చని అంచనా...

'పెళ్లిచూపులు' ఇప్పుడు టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన చిన్న సినిమా. ఈ సినిమా రిలీజ్‌కి ముందే సురేష్ బాబు, మధుర శ్రీధర్ లాంటి వారు సోషల్ మీడియాలో సూపర్‌గా వుందంటూ చెబితే.. అదంతా పబ్లిసిటీ స్టాటజీ అనుకొన్నారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాకా అది నిజం అయ్యింది. ఈ సినిమా మార్నింగ్ షోకి కలెక్షన్లు అంతగా లేవు. అదే రోజు రిలీజ్ అయిన సునీల్ 'జక్కన్న'కి కలెక్షన్లు అదిరిపోయాయి. కానీ.. సాయంత్రానికి సీన్ మారిపోయింది. స్ట్రాంగ్ మౌత్ టాక్‌తో 'పెళ్ళిచూపులు' కలెక్షన్లు అనూహ్యంగా పెరిగాయి. రెండో రోజు ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగాయి.ఇక్కడే కాదు యుఎస్‌లో కూడా ఈ సినిమా రెండు రోజులకు 74,862 డాలర్లు కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక 'జక్కన్న' సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకి అడ్డులేకుండా పోయింది. దాంతో ఈ సినిమాకి థియేటర్లు పెంచుతున్నారట. 2 కోట్లలోపు బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా 10 కోట్ల వరకు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com