సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!

- February 23, 2026 , by Maagulf
సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!

సురబయః సౌదీ అరేబియాలోని రెండు పవిత్ర మస్జీదుల ఇఫ్తార్ కార్యక్రమం కింద ఇండోనేషియాలోని సురబయలోని గ్రాండ్ మస్జీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కు 21,500 మంది హాజరయ్యారు. ఇది అతిపెద్ద రమదాన్ సమావేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇండోనేషియాలోని సౌదీ రాయబార కార్యాలయంలో  ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇఫ్తార్ తోపాటు రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడి బహుమతిని కలిపి పంపిణీ చేశారు.  తూర్పు జావా గవర్నర్ ఖోఫిఫా ఇందార్ పరవాన్సా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై..  ఇస్లాం మరియు ముస్లింలకు సేవ చేయడంలో సౌదీ అరేబియా చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమం ఇస్లామిక్ మరియు మానవతావాద పనులకు.. ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి సౌదీ అరేబియా చేస్తున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుందని సౌదీ మత అనుబంధ అహ్మద్ అల్-హజ్మీ అన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com