సుధాకర్ మెగాస్టార్ చిరంజీవికి మంచి స్నేహితుడు

- July 31, 2016 , by Maagulf
సుధాకర్ మెగాస్టార్ చిరంజీవికి మంచి స్నేహితుడు

ఒకప్పుడు టాలీవుడ్ కమెడియన్లలో టాప్ కమేడియన్ గా ఒక వెలుగు వెలిగిన సుధాకర్ మెగాస్టార్ చిరంజీవికి మంచి స్నేహితుడు. వీరిద్దరూ చెన్నైలో ఒకే రూమ్ లో కలిసి ఉంటూ చెన్నై ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. హీరోగా మొదలు పెట్టి ఆ తరువాత హాస్యనటుడుగా ఒక వెలుగు వెలిగిన సుధాకర్ అనారోగ్యం కారణంగా చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.దీర్ఘకాలిక అనారోగ్యం నుండి తేరుకున్న సుధాకర్ మళ్ళి ఈ మధ్య సినిమాలలో నటిస్తున్నాడు సాయిరామ్ శంకర్ హీరోగా రూపొందుతున్న 'వాడు నేను కాదు' అనే సినిమా ద్వారా సుధాకర్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసందర్భంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధాకర్ చిరంజీవి పవన్ ల గురించి అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.తాము ఇద్దరం కలిసి రూంలో ఉన్నపుడు సరదాగా 'నాయనా చిరంజీవి త్వరగా రెడీ అవ్వు ఇనిస్టిట్యూట్ వెళ్లాలి' అనేవాడిని అన్న విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ అప్పటికి చిరంజీవి పేరు వరప్రసాద్ గానే ఉండేదని చెపుతూ ఆ తర్వాతే చిరంజీవిగా పేరు మారడంలో తన పాత్ర కూడ ఉంది అనే విషయాన్ని బయటపెట్టాడు. అంతేకాదు తాము కలిసి ఉండే రోజులలో చిరంజీవి అన్నం వండేవాడని తాను కూరలు చేసేవాడిని అంటూ ఆరోజులు గుర్తుకు చేసుకున్నాడు. ఇక చిరంజీవి నటించిన 'పునాది రాళ్లు' సినిమాలో ఆఫర్ ముందు తనకే వచ్చిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ అప్పటికి తాను తమిళ సినిమాలో చేస్తున్న సమయంలో తనకు వేరే సినిమాలలో చేయవద్దనే అగ్రిమెంటు ఉండటంతో 'పునాది రాళ్లు' సినిమా ఛాన్స్ చిరంజీవికి వచ్చిన సందర్భాన్నివివరించాడు.తాను బాగా తాగడంతో తన ఆరోగ్యం పాడు అయింది అన్న రూమర్స్ పై స్పందిస్తూ తానూ ఎప్పుడూ లిమిట్ గానే తాగేవాడిని అని చెపుతూ తనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల తన ఆరోగ్యం దెబ్బదిన్న విషయాన్ని బయటపెట్టాడు సుధాకర్. ఇక పవన్ గురించి మాట్లాడుతూ తాను పవన్ తో సుస్వాగతం సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నప్పుడు పవన్ చాలా బిడియంగా కనిపించిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ తన కొడుకు పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అని అంటూ ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసాడు సుధకర్..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com