కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- February 24, 2026
రియాద్: కువైట్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే మారిటైమ్ కోఆర్డినేట్లను ఉపసంహరించుకోవాలని ఇరాక్‌కు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) సెక్రటరీ జనరల్ జాసెం మొహమ్మద్ అల్బుదైవి పిలుపునిచ్చారు. ఇరాక్ సముద్ర ప్రాంతాలకు సంబంధించిన వివాదస్పదమైన కోఆర్డినేట్ల జాబితా మరియు మారిటైమ్ మ్యాప్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు.
పరస్పర విశ్వాసాన్ని పెంపొందించడానికి సంబంధిత చట్టపరమైన మరియు అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగా కోఆర్డినేట్ల జాబితాను మరియు మారిటైమ్ మ్యాప్‌ను సమీక్షించుకోవాలని ఇరాక్ కు సూచించారు.
ఇరాక్ తో మంచి చారిత్రక సంబంధాలు ఉన్నాయని, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఇలాంటి వివాదస్పద వాదనలు దోహదపడవని పేర్కొన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ చట్టాల ప్రకారం ముందుకు వెళ్లాలని, ఈ విషయంలో ఇరాక్ తన వాదనలను సమీక్షించుకుంటుందన్న ఆశాభావం ఉందని జీసీసీ సెక్రటరీ జనరల్ తెలిపారు.
తాజా వార్తలు
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!
- ఒమన్ లో ఆసియా జాతీయులు అరెస్టు..!!
- రికార్డు స్థాయిలో ఖతార్ మునిసిపాలిటీ సర్వీసెస్..!!









