టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- February 24, 2026
ICC T20 World Cup 2026 తుది దశకు చేరుకుంటున్న వేళ క్రికెట్ అభిమానులకు ఐసీసీ కీలక సమాచారం వెల్లడించింది. సెమీఫైనల్ మరియు ఫైనల్ మ్యాచ్‌ల టికెట్ల విక్రయం ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి అధికారిక వెబ్సైట్లలో ప్రారంభమవుతుందని ప్రకటించింది.
టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం మార్చి 4న తొలి సెమీఫైనల్, మార్చి 5న రెండో సెమీఫైనల్, మార్చి 8న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి. రెండో సెమీఫైనల్‌కు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఖరారైంది.
పాకిస్థాన్ ప్రదర్శనపై వేదిక నిర్ణయం
తొలి సెమీఫైనల్, ఫైనల్ వేదికలు పాకిస్థాన్ జట్టు ప్రదర్శనపై ఆధారపడి ఉంటాయని ఐసీసీ వెల్లడించింది.
- పాకిస్థాన్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే — మ్యాచ్ కొలంబోలో జరుగుతుంది.
- పాక్ అర్హత సాధించకపోతే, శ్రీలంక సెమీస్‌కు చేరి భారత్‌తో ఆడని పరిస్థితిలో — మ్యాచ్ కొలంబోలోనే ఉంటుంది.
- పై పరిస్థితులు లేకపోతే తొలి సెమీఫైనల్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక అవుతుంది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్‌లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









