ఆగస్టు 15 ప్రసంగంలో చేర్చవలసిన అంశాలపై సూచనలు, సలహాలు కోరిన ప్రధాని

- July 31, 2016 , by Maagulf
ఆగస్టు 15  ప్రసంగంలో చేర్చవలసిన అంశాలపై సూచనలు, సలహాలు కోరిన ప్రధాని

ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి తాను చేసే ప్రసంగంలో చేర్చవలసిన అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. 'మన్‌ కీ బాత్' కార్యక్రమంలో భాగంగా ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి ఆలిండియా రేడియోలో ఆదివారంనాడు ప్రసంగించారు. ఎర్రకోట నుంచి ప్రధాని ఒక్కరే మాట్లాడతారనే అభిప్రాయం ప్రజల్లో కలుగరాదని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. 'మీ మనసుకు తోచినది నాతో పంచుకోండి. ఆ ఆలోచనను, సూచనలను నాకు తెలియ చేయండి. వాటిని నేను దేశ ప్రజల ముందుంచుతాను' అంటూ మోదీ సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com