పెసర పప్పు కిచిడి

- July 31, 2016 , by Maagulf
పెసర పప్పు కిచిడి

కావలసినవి :

బియ్యం : 3 కప్పులు , పెసర పప్పు : 1 కప్పు , పచ్చిమిర్చి : 4 , అల్లం వెల్లుల్లి : 2 టీ స్పూన్ , పసుపు : అర టీ స్పూన్ , లవంగాలు : 4 , దాల్చిన చెక్క : 1 , యాలకులు : 4 , షాజీర : అర టీ స్పూన్ , పలావు అకులు : 1 , నెయ్యి : 2 టీ స్పూన్లు , ఉప్పు తగినంత , కొత్తిమీర తురుము కొద్దిగ
తయారుచేసే విధానం :
బాణిలొ నెయ్యివేసి, షాజీర, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వీసి వేయించాలి. తరువాత, అల్లంవెల్లుల్లి వేసి ఓ నిమిషం వేగాక, పచ్చిమిర్చి ముక్కలు, పలావు ఆకులు, పసుపు వేయాలి. తరువాత నానబెట్టిన బియ్యం, పసుపు వేసి ఓ అయిదు నిమిషాలు వేయించాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి, ఉప్పు వేసి మరిగించాలి. తరువాత మంట తగ్గించి నీళ్లన్ని ఇగిరిపొయె వరకు సుమారు 15 నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లి దించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com