'డెకాయిట్' నుంచి లవ్ మెలోడీ 'రుబరూ' రిలీజ్
- February 27, 2026
బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్బస్టర్లతో మోస్ట్ బ్యాంకబుల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ ఇప్పుడు పూర్తిగా కొత్త అవతార్ లో డెకాయిట్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ముఖ్యంగా మదనపల్లె స్లాంగ్‌లో డైలాగులు చెప్పడం సినిమా పై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.
తాజాగా విడుదలైన “రుబారూ” పాట ప్రేమ, బాధల కలయికగా అందరినీ హత్తుకుంటోంది. సంగీత దర్శకుడు భీమ్స్ అందించిన స్వరాలు రస్టిక్ టచ్‌తో మెలోడీని మరింత ఎలివేట్ చేసింది. ఆయనతో పాటు చిన్మయి వాయిస్ ఈ పాటకు ప్రాణం పోసింది.
భాస్కర్ భట్ల రవికుమార్ రాసిన సాహిత్యం ఒక యువకుడి ప్రేమను, ఆ ప్రేమ తర్వాత జరిగిన ద్రోహంతో అతని జీవితంలో వచ్చిన మార్పును అద్భుతంగా చూపిస్తోంది.
శేష్ – మృణాల్ జంట మధ్య ఉన్న సహజమైన కెమిస్ట్రీ ఈ పాటకు ఎమోషనల్ పవర్. వారి ప్రేమలోని మాధుర్యం, తరువాత జరిగే ద్రోహం వల్ల కలిగే బాధ ఇవన్నీ “రుబారూ”లో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ పాట సినిమా కథలో ఒక కీలక మలుపు కాబోతోంది.
సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తోంది. సినిమాటోగ్రఫీని ధనుష్ నిర్వహిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను జ్ఞాని అందిస్తున్నారు.
‘డెకాయిట్’ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్‌తో బస్‌పాస్‌లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









