రియాద్‌లో రాజమండ్రి దంపతుల హత్య

- February 28, 2026 , by Maagulf
రియాద్‌లో రాజమండ్రి దంపతుల హత్య

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో మనసును కలిచివేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన ఓ విద్యార్థి విచక్షణ కోల్పోయి కన్న తల్లిదండ్రులనే అత్యంత కిరాతకంగా హతమార్చాడు.ఆ పై తాను కూడా భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రియాద్‌లోని తెలుగు ప్రవాసీ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆన్‌లైన్ గేమింగ్ ఎంతటి ప్రమాదకరంగా మారుతుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గాలి రవి (49), శ్రీదేవి (43) దంపతులు గత కొంతకాలంగా రియాద్‌లోని హరా ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరి కుమారుడు యెజ్ర ప్రభాకర్ స్థానిక భారతీయ పాఠశాలలో ప్లస్ 2 చదువుతున్నాడు. అయితే ప్రభాకర్ ఆన్‌లైన్ గేమ్‌లకు తీవ్రంగా బానిసయ్యాడు. చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని తల్లిదండ్రులు తరచూ మందలించేవారు.

గురువారం రాత్రి ఇదే విషయమై మరోసారి మందలించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రభాకర్, విచక్షణ కోల్పోయి తల్లిదండ్రులను కత్తితో పొడిచి చంపేశాడు.అనంతరం ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి తిన్నాడు. కొంతసేపటికి తాను నివసిస్తున్న భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రవి ఓ బ్యాంకులో, శ్రీదేవి ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ అందరితో స్నేహంగా ఉండేవారని స్థానిక ప్రవాసీయులు గుర్తు చేసుకున్నారు. కన్నకొడుకు చేతిలోనే ఇంత దారుణంగా చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని కన్నీటిపర్యంతమయ్యారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com