శ్రీవారి సేవలో ‘డెకాయిట్’ టీమ్
- February 28, 2026
కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామివారిని ‘డెకాయిట్’ చిత్ర బృందం శనివారం ఉదయం దర్శించుకుంది. ఈ చిత్రంలో జంటగా నటించిన హీరో అడివి శేష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వీఐపీ విరామ దర్శనంలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికి, దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
త్వరలో విడుదల కానున్న తమ చిత్రం ‘డెకాయిట్’ ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ వీరు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అడివి శేష్, మృణాల్‌లను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో కొద్దిసేపు అక్కడ కోలాహలం నెలకొంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లలో వేగం పెంచింది. గురువారం వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న శేష్, నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషం.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







