'సైతాన్' లో విజయ్ ఆంటోనీ...
- July 31, 2016
తొలుత పెద్దగా స్టార్‌డమ్ లేని నటుడు విజయ్ ఆంటోనీ... వరుస విజయాలతో తన స్థాయి పెంచుకున్నారు. 'పిచ్చైకారన్' (బిచ్చగాడు)తో ఆయన మార్కెట్ మరింత పెరిగింది. తెలుగులో ఇంకా ఎక్కువైందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. సంగీత దర్శకుడిగా ఆరంభంలోనే ఒడిదొడుకులను ఎదుర్కొని.. తర్వాత కథానాయకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అప్పుడూ కొన్ని సమస్యలు తప్పలేదు. 'నాన్', 'సలీం'లతో గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు తాజాగా 'పిచ్చైక్కారన్' భారీ విజయాన్ని అందించింది. ఈ నేపథ్యంలో వస్తున్న ఆయన తదుపరి చిత్రం 'సైతాన్'పై అంచనాలు మరింత పెరిగాయి. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. అరుంధతీ నాయర్ హీరోయిన్. సినిమాకు సంబంధించిన సెకండ్ లుక్ పోస్టరు తాజాగా విడుదలైంది. గతంలో 'సలీం', 'నాన్' సినిమాల తరహాలో ఆయనదైన శైలిలో చాలా సీరియస్‌గా ఇందులోనూ కనిపిస్తున్నారు. ఇది ప్రేమ, కుటుంబ నేపథ్యమున్న చిత్రమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







