యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్‌లకు క్రౌన్ ప్రిన్స్ సంఘీభావం..!!

- March 01, 2026 , by Maagulf
యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్‌లకు క్రౌన్ ప్రిన్స్ సంఘీభావం..!!

జెడ్డాః ఇరాన్ దాడులకు గురైన యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్‌లకు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ సంఘీభావరం ప్రకటించారు. ఈ మేరకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని, కువైట్ ఎమిర్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా మరియు జోర్డాన్ రాజు అబ్దుల్లా II లతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేస్తున్న దారుణమైన దాడులకు ప్రతిస్పందనగా వారు తీసుకునే ఏ చర్యలకైనా మద్దతు ఇవ్వడానికి సౌదీ అరేబియా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రాంతం యొక్క భద్రత మరియు స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com