ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- March 04, 2026
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనం సృష్టించిన చాట్ జీపీటీ (ChatGPT) ఇప్పుడు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం ‘పెంటగాన్’ తో OpenAI కుదుర్చుకున్న ఒక వివాదాస్పద ఒప్పందమే దీనికి ప్రధాన కారణం. ఈ ఒప్పందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పటికే 25 లక్షల మందికి పైగా యూజర్లు తాము ఇకపై ఈ చాట్‌బాట్ ను వాడబోమని ప్రతిజ్ఞ చేయడం టెక్ ప్రపంచంలో కలకలం రేపుతోంది. అసలు వివాదం ఏమిటి? గత వారం OpenAI సంస్థ అమెరికా రక్షణ శాఖతో ఒక కీలక ఒప్పందంపై సంతకం చేసింది. దీని ప్రకారం, పెంటగాన్ తన క్లాసిఫైడ్ నెట్‌వర్క్‌లలో చాట్ జీపీటీ మోడల్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఏఐ టెక్నాలజీని నిఘా కోసం లేదా యుద్ధ సంబంధిత కార్యకలాపాల కోసం వాడుతారేమో అన్న భయం యూజర్లలో మొదలైంది. సోషల్ మీడియాలో వస్తున్న సంతకాలు, యాప్ వినియోగ డేటా ప్రకారం.. ప్రజలు ఓపెన్ ఏఐ (OpenAI) తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్‌లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్‌లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!
- 9 డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేశాము: సౌదీ









