బాలీవుడ్‌ వివాహాలపై హాలీవుడ్‌లో ఓ సినిమా...

- August 01, 2016 , by Maagulf
బాలీవుడ్‌ వివాహాలపై హాలీవుడ్‌లో ఓ సినిమా...

 బాలీవుడ్‌ ఇండస్ట్రీలో జరిగే వివాహాలపై హాలీవుడ్‌లో ఓ సినిమా రాబోతోంది. దీనికి '5 వెడ్డింగ్స్‌' అనే పేరు ఖరారు చేశారు. ఇందులో బాలీవుడ్‌ నటి నర్గిస్‌ ఫక్రి నటించనుంది. ఈ చిత్రానికి నమ్రతా సింగ్‌ గుజ్రాల్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నర్గిస్‌ ప్రముఖ హాలీవుడ్‌ తారలు క్యాండీ క్లార్క్‌, డెరెక్‌లతో కలిసి నటించబోతోంది. బాలీవుడ్‌లో జరిగే వివాహాల గురించి కథనాలు రాయడానికి అమెరికా నుంచి వచ్చిన జర్నలిస్ట్‌గా నర్గిస్‌ఇందులో నటించనుంది. ఈ సినిమా గురించి నర్గిస్‌ మీడియాతోమాట్లాడుతూ.. ''ఈ సినిమాలోని పాత్రకూ నాకూ కనెక్షన్‌ కుదిరిందని ఈ అంతర్జాతీయ ప్రాజెక్ట్‌కి ఒప్పుకున్నా. నేను కూడా అమెరికన్‌నే కాబట్టి సులువుగా నటించగలలన్న నమ్మకం ఉంది. చిత్రీకరణ అమెరికా, ఇండియాలో జరుగుతుంది'' అని చెప్పుకొచ్చింది.
బాలీవుడ్‌లోనే కాదు... హాలీవుడ్‌లోనూ నటించి మంచి పేరు తెచ్చుకోవాలనుంది అంటున్న నర్గిస్‌... రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకోగలుగుతున్నానని చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com