చైనాలో రైడ్ షేరింగ్ దిగ్గజాలు ఉబర్
- August 01, 2016
చైనాలో రైడ్ షేరింగ్ దిగ్గజాలు ఉబర్, దిది చుక్సింగ్ లకు మధ్య నెలకొన్న ప్రచండ యుద్ధానికి తెరపడనుంది. ఉబర్ ఓ మెట్టు దిగొచ్చినట్టు తెలుస్తోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద మార్కెట్ గా ఉన్న చైనా ఆపరేషన్స్ ను ఉబర్, తన ప్రత్యర్థి కంపెనీ దిది చుక్సింగ్ లో విలీనం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ విలీన డీల్ తో 35 బిలియన్ డాలర్ల(సుమారు రూ.2,33,551 కోట్లు)విలువగా సంయుక్త కంపెనీ ఆవిర్భవించబోతుందని బ్లూమ్ బర్గ్ రిపోర్టు నివేదించింది. ఈ సంయుక్త కంపెనీలో ఉబర్ చైనా ఇన్వెస్టర్లు 20 శాతం స్టాక్ ను పొందనున్నట్టు తెలిపింది. ఈ కొత్త డీల్ తో ఉబర్ లో దిది చుక్సింగ్ ఒక బిలియన్ డాలర్లను( సుమారు రూ.6,673 కోట్లను) పెట్టుబడులుగా పెట్టనుందని బ్లూమ్ బర్గ్ నివేదించింది..
చైనాలో ఉబర్ కు ఎదురవుతున్న భారీ నష్టాలను తొలగించుకోవడానికి ఆ సంస్థ ఈ మేరకు పావులు కదుపుతుందని బ్లూమ్ బర్గ్ రిపోర్టు తెలిపింది. భవిష్యత్తులో తమ మనుగడును కొనసాగించడానికి ఈ డీల్ సాయపడనుందని ఉబర్ భావిస్తున్నట్టు తెలిపింది. ఈ నిర్ణయం పై అధికారిక ప్రకటన నేడు(సోమవారం) వెలువడే అవకాశముందుని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. అయితే ఈ రిపోర్టులపై ఉబర్, దిది చుక్సింగ్ కంపెనీల అధికార ప్రతినిధులు వెంటనే స్పందించడానికి నిరాకరించారు. చైనా మార్కెట్ షేరును దక్కించుకోవడానికి, ఆధిపత్య స్థానంలో కొనసాగడానికి ఈ రెండు సంస్థలు బిలియన్ డాలర్లను డ్రైవర్లకు, ప్యాసెంజర్ల సబ్సిడీల కోసం వెచ్చిస్తూ ఉన్నాయి.
చైనా రైడ్ షేరింగ్ మార్కెట్ లో 90శాతం స్థానాన్ని దిది సొంత చేసుకున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. గత నెలే ఈ కంపెనీలో యాపిల్ ఇంక్ వంద కోట్ల డాలర్లను పెట్టుబడులుగా కూడా పెట్టింది. 50 దేశాలకు పైగా విస్తరించిన ఉబర్, అత్యంత విలువైన స్టార్టప్ కంపెనీల్లో ఒకటిగా నిలుస్తోంది. అయితే ఈ కంపెనీ చాలా ప్రాంతాల్లో రెగ్యులేటరీ నిబంధనను, టాక్సీ ఆపరేటర్ల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ రిపోర్టులు వెలువడిన వెంటనే రైడ్ షేరింగ్ పై కొత్త నిబంధనలు విధిస్తూ చైనీస్ అథారిటీలు ప్రకటన విడుదల చేశారు. తక్కువ ధరలకు రైడ్ షేరింగ్ ఆపరేట్ చేయడంపై నిషేధం, సబ్సిడీలు ఆఫర్లపై పరిమితులను ఈ నిబంధనలు విధించాయి.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







