మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!

- March 06, 2026 , by Maagulf
మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!

మనామా: ఇరాన్ దాడులలో బహ్రెయిన్ రాజధాని మనామా దద్దరిల్లింది. ఇరాన్ దాడుల్లో రెండు హోటళ్ళు మరియు ఒక నివాస భవనం దెబ్బతిన్నాయి. స్వల్పాం ఆస్తి నష్టం జరిగిందని,  ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

అయితే అత్యవసర బృందాలు పరిస్థితిని చక్కదిద్దాయని, ప్రభావిత ప్రాంతాలలో వేగంగా స్పందించి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చాయని పేర్కొన్నారు.  దాడుల్లో దెబ్బతిన్న భవనాల్లోని వారందరినీ సురక్షితంగా ఖాళీ చేయించామని తెలిపారు. సంబంధిత అధికారులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని, పౌరులు, నివాసితుల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు తీసుకున్నట్లు వెల్లడించారు. 

అధికారిక సమాచారాన్ని మాత్రమే ఫాలో కావాలని సూచించారు.  ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే సమీపంలోని పోలీసులు, ఇతర సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com