ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- March 06, 2026
అమెరికా: నటి, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన మైలురాయిని అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్రతిష్టాత్మక 98వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్స్ 2026) వేడుకలో ఆమె అవార్డు ప్రజెంటర్‌గా ఎంపికయ్యారు. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఈ నెల 15న జరగనున్న ఈ మహా వేడుకలో ప్రియాంక తన మెరుపులు మెరిపించనున్నారు.
ఈ వేడుకలో ప్రియాంక కేవలం అతిథిగా మాత్రమే కాకుండా, హాలీవుడ్ అగ్ర నటులైన రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్ వంటి దిగ్గజాలతో కలిసి వేదికను పంచుకోనుండటం విశేషం. గతంలో 2016లో కూడా ఆమె ఆస్కార్ ప్రజెంటర్‌గా వ్యవహరించి అందరి దృష్టిని ఆకర్షించగా, సరిగ్గా దశాబ్దం తర్వాత (10 ఏళ్ల తర్వాత) మళ్ళీ అదే గౌరవాన్ని దక్కించుకోవడం విశేషం. ఈ విషయాన్ని అకాడమీ అధికారికంగా ప్రకటించడంతో పాటు, ప్రియాంక సైతం తన సోషల్ మీడియా వేదికగా ఈ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది.
ఈ ఏడాది ఆస్కార్ వేడుకలకు మరో ప్రత్యేకత ఉండబోతుంది. ప్రముఖ టీవీ హోస్ట్ కోనన్ ఓ’బ్రియన్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా, ప్రజెంటర్ల జాబితాలో ప్రియాంకతో పాటు అన్నే హాత్వే, గ్వినేత్ పాల్ట్రో, పాల్ మెస్కల్ వంటి హాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, ఈసారి ‘Sinners’ చిత్రం ఏకంగా 16 నామినేషన్లతో రికార్డులు సృష్టిస్తోంది. ఉత్తమ నటుడి కేటగిరీలో లియోనార్డో డికాప్రియో, తిమోతీ చాలమెట్ వంటి హేమాహేమీల మధ్య గట్టి పోటీ నెలకొంది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







