పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- March 06, 2026
కువైట్ సిటీ: దేశంలో కొనసాగుతున్న భద్రతా కార్యకలాపాల నేపథ్యంలో ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ కోరింది. ముఖ్యంగా పిల్లలు, విదేశీ కార్మికులలో భయాందోళనలు కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రిత్వ శాఖ భద్రతా మీడియా విభాగం డైరెక్టర్ కల్నల్ ఉస్మాన్ మహమ్మద్ గరీబ్ స్పష్టం చేశారు.
తల్లిదండ్రులు, యజమానులకు సూచనలు:
- సైరన్ల శబ్దం లేదా పేలుళ్ల శబ్దాలు వినిపించినప్పుడు పిల్లలు భయపడకుండా వారికి భరోసా ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు. భయం వల్ల పిల్లలపై దీర్ఘకాలిక మానసిక ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
- ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళనకు గురవుతున్న గృహ కార్మికులకు,బయటి కార్మికులకు యజమానులు ధైర్యం చెప్పాలని కోరారు.
- దేశంలోని నివాసితులందరికీ అర్థమయ్యేలా భద్రతా సూచనలను మంత్రిత్వ శాఖ పలు భాషల్లో అందుబాటులో ఉంచింది.
పుకార్లపై కఠిన హెచ్చరిక:
సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం లేదా తప్పుదోవ పట్టించే వీడియోలను షేర్ చేయవద్దని కల్నల్ గరీబ్ గట్టిగా హెచ్చరించారు.ఇటువంటి చర్యలు జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తాయని, పుకార్లు వ్యాప్తి చేసే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కువైట్ దేశ భద్రత కోసం అంతర్గత మంత్రిత్వ శాఖ సిబ్బంది మరియు ఇతర ప్రభుత్వ విభాగాలు 24 గంటలూ శ్రమిస్తున్నాయని, పౌరులు మరియు ప్రవాసీలు చూపుతున్న సంఘీభావం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!









