OTTలోకి వచ్చేసిన ‘విత్ లవ్’
- March 06, 2026
థియేటర్లలో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘విత్ లవ్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చేసింది. యువ నటులు అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, నేటి నుంచి (మార్చి 6) స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే కథాంశంతో తెరకెక్కిన ‘విత్ లవ్’ బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే రూ. 10 కోట్ల వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. యువతను విశేషంగా ఆకర్షించిన ఈ రొమాంటిక్ డ్రామా, థియేటర్లలో మిస్ అయిన వారికి ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని చూసే అవకాశం దక్కింది. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
కథ
ఈ చిత్ర కథ ప్రధానంగా ప్రేమ, స్నేహం, గుర్తులు అనే భావాల చుట్టూ తిరుగుతుంది. డిజైనర్ అయిన సత్య (అభిషన్ జీవింత్) పెళ్లి చూపులకు వెళ్తాడు. అక్కడ పెళ్లి కూతురు స్కూల్ రోజుల్లో తనకు రెండేళ్ల జూనియర్ అయిన మనీషా (అనస్వర రాజన్) అని తెలిసి ఆశ్చర్యపోతాడు. ఈ పరిచయం ఇద్దరినీ తమ పాత స్కూల్ డేస్‌ను గుర్తు చేసుకునేలా చేస్తుంది. స్కూల్ రోజులలో సత్య అనీషా (కావ్య అనిల్)ను ఇష్టపడుతుండగా, మనీషా మాత్రం బాలాజీ (సచిన్ నాచియప్పన్)పై ప్రేమ పెంచుకుంటుంది. కానీ ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని ఎవరితోనూ చెప్పకుండా మనసులోనే దాచుకుంటారు.కథల పోటీలు
కాలం గడిచిన తర్వాత పెళ్లి చూపుల సందర్భంలో కలుసుకున్న సత్య, మనీషా తమ గత ప్రేమలను గుర్తు చేసుకుంటూ ఒక నిర్ణయం తీసుకుంటారు. తాము ప్రేమించిన వ్యక్తులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వారిని కలిసి తమ మనసులోని మాట చెప్పాలని అనుకుంటారు. అయితే తర్వాత ఏమైంది? సత్య, మనీషా పెళ్లి చూపులు చివరికి ఎలా మారాయి? వారు తమ పాత ప్రేమికులకు నిజం చెప్పగలిగారా? లేక చివరికి వీరిద్దరి మధ్యే ప్రేమ చిగురించిందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









