‘టెక్స్లా’ మూవీ గ్రాండ్ గా లాంచ్
- March 06, 2026
ఐశ్వర్యా రజినీకాంత్ దర్శకత్వంలో కన్నన్ రవి గ్రూప్ బ్యానర్‌పై నిర్మాత కన్నన్ రవి నిర్మిస్తున్న ‘టెక్స్లా’ చిత్ర ప్రారంభ వేడుక చెన్నైలో ఈరోజు (మార్చి 6, 2026) ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో జై, సురాజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రంలో ఆనంద్ రాజ్, జి.ఎం.సుందర్, జార్జ్ మారియన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నిర్మాత కన్నన్ రవి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దీపక్ రవి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఇంట్రో వీడియోకు మంచి స్పందన వచ్చింది. చెన్నైలోని ఒక స్టార్ హోటల్లో అధికారికంగా సినిమా ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు నామ్ తమిళర్ కచ్చి చీఫ్ కోఆర్డినేటర్ సీమన్, లతా రజినీకాంత్, ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి, దర్శకుడు బాలా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు, నటులు, టెక్నీషియన్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
నిర్మాత కన్నన్ రవి మాట్లాడుతూ.. “ఇలాంటి వేదికపై మాట్లాడటం ఆనందంగా వుంది. సినిమా రంగంలో నేను ఇంకా చిన్న చిన్న అడుగులు వేస్తున్నవాడినే. వ్యాపార రంగంలో ధైర్యంగా మాట్లాడగలిగినా, సినిమాల విషయానికి వస్తే నేను ఇంకా నేర్చుకుంటున్న విద్యార్థినే.
తమిళనాడుకు చెందిన సూపర్ స్టార్ కుటుంబంతో కలిసి పని చేసే అవకాశం రావడం నాకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఐశ్వర్యా రజినీకాంత్ ఎంతో ప్రతిభావంతమైన దర్శకురాలు. ఆమె ప్రతిభతో పాటు ఆమె వినయం కూడా నన్నెంతో ఆకట్టుకుంది.
సురాజ్ వెంజరమూడుతో కలిసి పని చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము గతంలో కొన్ని ప్రాజెక్టులు చేయాలని అనుకున్నా అవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఈ చిత్రంతో కలిసివస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ ధన్యవాదాలు. ఇది ఒక దీర్ఘ ప్రయాణానికి ఆరంభం అని నమ్ముతున్నాను”
సీమన్ మాట్లాడుతూ .. మంచి ప్రారంభం వుంటే సగం విజయం సాధించినట్టే. ఆ ఈ విజయంతో ‘టెక్స్లా’ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. ఈరోజుల్లో సినిమా నిర్మించడం చాలా సవాళ్లతో కూడుకున్న పని. అయినా కూడా నిర్మాత కన్నన్ రవి ఒకేసారి పదహారు సినిమాలను నిర్మించడం ఆయనకు సినిమాపై ఉన్న ఆసక్తి, అంకితభావాన్ని చూపుతోంది.
ఈ చిత్రంలో పనిచేస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకురాలు ఐశ్వర్యా రజినీకాంత్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను.
దర్శకుడు బాలా మాట్లాడుతూ.. ముందుగా నా చెల్లెలు ఐశ్వర్యాకు నా శుభాకాంక్షలు. ఆమెపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన నిర్మాత కన్నన్ రవికి అభినందనలు. ఒకేసారి ఎన్నో సినిమాలు నిర్మించడం ద్వారా ఆయన పరిశ్రమలో ఎన్నో కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. అందుకు ఆయన ప్రత్యేకంగా అభినందించాల్సిందే. జై, యువన్ శంకర్ రాజా, మొత్తం చిత్రబృందానికి నా శుభాకాంక్షలు” .
నటుడు సముద్రఖని మాట్లాడుతూ..చాలా కాలం తర్వాత తమిళ సినీ పరిశ్రమ అంతా కలిసి ఒక సినిమా ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భం ఇది. నిర్మాత కన్నన్ రవి సినిమాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పరిశ్రమ పెద్ద సంఖ్యలో పాల్గొనడం ప్రత్యేకతగా కనిపిస్తోంది.
నిన్న ఆయనతో కలిసి ప్రయాణించే అవకాశం వచ్చింది. మనం సంపాదించినదాంట్లో కొంత భాగాన్ని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించాలనే ఆయన భావన నన్నెంతో ప్రభావితం చేసింది. ఆయన ఇంకా వందల సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను”
నటుడు సురాజ్ వెంజరమూడు మాట్లాడుతూ.. ఈ చిత్ర కథ , నేను పోషిస్తున్న పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఐశ్వర్యా రజినీకాంత్ దర్శకత్వంలో పని చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నిర్మాత కన్నన్ రవి ఎంతో మంచి మనసున్న వ్యక్తి. ఆయనతో కలిసి పని చేయడం నాకు గర్వంగా ఉంది”
దర్శకురాలు ఐశ్వర్యా రజినీకాంత్ మాట్లాడుతూ.. “ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా చిత్ర ప్రయాణానికి ఇది మంచి ప్రారంభం. నాపై, నా టీంపై నమ్మకం ఉంచిన నిర్మాత కన్నన్ రవికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని విజయవంతం చేయడానికి మేమంతా పూర్తి నిబద్ధతతో పని చేస్తాము”
నటుడు జై మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకురాలు ఐశ్వర్యా రజినీకాంత్‌కి ధన్యవాదాలు. నిర్మాత కన్నన్ రవిని రెండు సంవత్సరాల క్రితం కలిశాను. అప్పట్లో కలిసి పని చేయాలని ఆయన చెప్పారు. కానీ అప్పట్లో నా కెరీర్ పరిస్థితి కారణంగా నేను సంకోచించాను.
ఒక నెల క్రితం మళ్లీ కలిసినప్పుడు, నా ఎదుగుదల ఆయన సినిమా ద్వారానే ప్రారంభమవుతుందని ఆయన నాపై నమ్మకం ఉంచారు. అందుకే ఈ చిత్రానికి నా శక్తి మేరకు కష్టపడి పనిచేస్తాను. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను”.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









