‘లేచింది మహిళాలోకం’ మర్డర్ చేయమని చెప్పే సినిమా కాదు: మంచు లక్ష్మి
- March 09, 2026
బ్రిహస్పతి ఎంటర్‌టైన్‌మెంట్స్, అప్పారెంట్లీ సినిమా, స్టోరీ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై హైమ రాజశేఖర్, శ్వేత మహి, నిరోష నవీన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘లేచింది మహిళాలోకం’. దర్శకద్వయం అర్జున్-కార్తిక్ రూపొందించిన ఈ చిత్రంలో మంచు లక్ష్మి, శ్రీరామ చంద్ర, అనన్య నాగళ్ల, హరితేజ, హేమ, సుప్రిత, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలు పోషించారు. కొత్తగా పెళ్లయిన ఒక జంట మధ్య చిన్న చిన్న విషయాలకే విబేధాలు రావడం.. వాటికి ఆజ్యం పోసేలా పక్కింటివాళ్లు తమ మాటలతో పొల్యూట్ చేయడం.. ఈ క్రమంలో జరిగే పరిణామాలు ఒకవైపు థ్రిల్‌కు గురి చేస్తూనే మరోవైపు కడుపుబ్బా నవ్వించేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం మార్చి 26న థియేటరల్లో విడుదలకు సిద్ధమవుతోంది. సన్‌స్టూడియో యూఎఫ్‌ఓతో కలిసి ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ సోమవారం ప్రసాద్ ల్యాబ్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఇండస్ట్రీ మాకు కొత్త. ఇక్కడ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నుంచి వచ్చాం. మొదటి ప్రయత్నంలోనే ఇంత మంచి సినిమా తీశాం. అందరూ మా సినిమాని థియేటర్స్‌లో చూసి ఆశీర్వదిస్తే ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాం’’ అని అన్నారు.
డైరెక్టర్ అర్జున్ మాట్లాడుతూ.. ‘‘యాక్టర్స్ అందరి డెడికేషన్ వల్లే సినిమా అనుకున్న విధంగా వచ్చింది. మా మహిళామణులు అందరూ ఎంతో చక్కగా మాకు సహకరించారు. డీవోపీ కూడా చాలా సహకరించారు. అందుకే సినిమా అవుట్ పుట్ ఇంత బాగా వచ్చింది. ఇది పూర్తిగా ఫన్ మూవీ అందరికీ నచ్చుతుంది. అందరూ తప్పకుండా చూడండి’’ అని తెలిపారు.
మరో డైరెక్టర్ కార్తిక్ మాట్లాడుతూ.. ‘‘ఇది ఫన్ రైడింగ్ ఫిల్మ్. ఆర్టిస్ట్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. ట్రైలర్ చూశారు కదా.. అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ సినిమాను థియేటర్లలో అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. మార్చి 26న అందరూ తప్పకుండా చూడండి’’ అని చెప్పారు
ఏపీ, తెలంగాణ యూఎఫ్‌ఓ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘‘సినిమా చూశాను. చాలా బాగుంది. ఇంత మంచి సినిమాను ప్రేక్షకుల దగ్గరికి ఎలాగైనా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నా. అందుకే రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చా. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. అందరూ తప్పకుండా థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నా’’ అన్నారు.
నటి హరితేజ మాట్లాడుతూ.. ‘‘ట్రయిలర్‌తో సినిమా వైబ్ అర్థమై ఉంటుంది. సినిమా చేస్తున్నప్పుడే చాలా ఎంజాయ్ చేశాం. చిన్న పాయింట్‌తో స్టార్ట్ అయి మూవీ అలా అలా వెళ్లిపోతుంది. చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేసేలా ఉంటుంది. మార్చి 26న అందరూ తప్పకుండా చూడండి.’’ అని తెలిపారు.
నటి హేమ మాట్లాడుతూ..‘‘ట్రైలర్ ఎంత బాగుందో చూశారు కదా.. ఒక కోతి ఉంటేనే అల్లరి ఎంత ఉంటుందో తెలుసు కదా.. అలాంటిది ఇంతమంది కోతులు ఉంటే అల్లరి ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోండి. ఈ సినిమా అందరినీ కడుపుబ్బా నవ్వించేలా ఉంటుంది. చాలా రోజుల తర్వాత నాకు ఒక మంచి పాత్ర దొరికింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అందరూ తప్పకుండా థియేటర్లలో చూడండి’’ అని చెప్పారు.
హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఒక మంచి కామెడీ ఫిల్మ్‌తో మీ ముందుకు వస్తున్నాం. కామెడీ సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. మా సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. నేను ఇప్పటి వరకు సీరియస్ రోల్స్ చేశా. ఫస్ట్ టైమ్ ఫుల్ కామెడీ మూవీ చేశా. అందరూ తప్పకుండా మా సినిమాను మార్చి 26న థియేటర్లలో చూసి బాగా ఎంజాయ్ చేయండి’’ అని తెలిపారు.
సింగర్, యాక్టర్ శ్రీరామ చంద్ర మాట్లాడుతూ.. ‘‘మహిళలందరికి ఉమేన్స్ డే శుభాకాంక్షలు. నేను, అనన్య ఇందులో జంటగా చేశాం. మా పెయిర్ బాగా వర్కవుట్ అయిందని అనుకుంటున్నాం. ఆడవాళ్లకు బంగారం, వెండి కొనడం కాదు.. అమ్మాయిలను బంగారంగా చూసుకుంటే అదే చాలు. అందరికీ రిలేటె అయ్యే స్టోరీ ఇది. అందరికీ సినిమా బాగా నచ్చుతుంది. నన్ను ఇందులో కొంచెం డిఫరెంట్‌గా చూస్తారు. సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.
నటి మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ‘‘మేము చిన్న చినిమా చేసినా.. అద్భుతమైన సినిమా చేశాం. నేను కామెడీ విషయంలో రెచ్చిపోయి చేశా. ఫ్లోలో చాలా మార్పులు చేశాం. సినిమాను సినిమాగానే చూడండి. సీరియస్ సబ్జెక్టును కామెడీగా చెప్తేనే వింటాం. ఆడవాళ్లు అందరూ చూస్తే చాలు. నిర్మాతలకు పెట్టిన డబ్బుల కంటే రెట్టింపు రావాలని కోరుకుంటున్నా. ఇంత మంచి మహిళలతో కలిసి సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రమోషన్స్‌లో చూపించిన బ్లూ డ్రమ్‌కు మా సినిమాకు సంబంధం ఉండదు. ‘లేచింది మహిళాలోకం’ మర్డర్ చేయమని చెప్పే సినిమా కాదు.. అందరినీ నవ్వించే చిత్రం. మార్చి 26న అందరూ తప్పకుండా చూడండి.’’ అని చెప్పారు.
తారాగణం:
మంచు లక్ష్మి, శ్రీరామ్ చంద్ర, అనన్యనాగళ్ల, హరితేజ, హేమ, సుప్రిత నాయుడు, శ్రద్ధాదాస్, హర్షవర్ధన్, భద్రం తదితరులు
సాంకేతిక బృందం:
బ్యానర్స్: బ్రిహస్పతి ఎంటర్‌టైన్‌మెంట్స్, అప్పారెంట్లీ సినిమా, స్టోరీ ఫ్యాక్టరీ
నిర్మాతలు: హైమ రాజశేఖర్, శ్వేత మహి, నిరోష నవీన్
డైరెక్టర్స్: అర్జున్-కార్తిక్
సంగీతం: శృతిరంజని
డీఓపీ: జాక్స్
ఎడిటర్: అనిల్
ఆర్ట్: జాన్సీ
పీఆర్వో: హరీష్
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









