డోపింగ్ కేసులో నర్సింగ్ యాదవ్‌కు క్లీన్చిట్
- August 01, 2016
డోపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు భారత డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) క్లీన్చిట్ ఇచ్చింది. దీంతో రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు నర్సింగ్కు మార్గం సుగమమైంది. రెజ్లింగ్ 74 కిలోల విభాగంలో భారత్ తరఫున నర్సింగ్ యాదవ్ బరిలో దిగనున్నాడు.
ఎన్నో ఆశలతో రియోకు సిద్ధమైన నర్సింగ్.. నాడా నిర్వహించిన డోప్ పరీక్షలో దొరికిపోయాడు. నిషిద్ధ ఉత్ప్రేరకం వాడినట్లు తేలడంతో అతడు ఒలింపిక్స్‌లో పాల్గొనడంపై గందరగోళం నెలకొంది. దీంతో నర్సింగ్పై తాత్కాలికంగా సస్పెన్షన్ వేటు వేశారు. నర్సింగ్ 'మెథన్‌డైనోన్' అనే నిషిద్ధ ఉత్ప్రేకరాన్ని వాడినట్లు గుర్తించారు. కాగా ఒలింపిక్స్‌కు వెళ్లకుండా అడ్డుకోవడానికి కుట్రపూరితంగా తనను ఇరికించారని నర్సింగ్ వాదించారు.
ఈ నేపథ్యంలో కుట్ర కోణంపై నాడా న్యాయ బృందం.. కమిటీ ముందు తమ వాదనలు వినిపించింది. విచారణ సందర్భంగా నర్సింగ్ కూడా హాజరయ్యాడు. తనపై కుట్ర జరిగిందనడానికి నర్సింగ్ సరైన ఆధారాలు సమర్పించలేదని న్యాయ బృందం వాదనలు వినిపించింది. కాగా పూర్తి విచారణ అనంతరం సోమవారం తుది తీర్పు వెలువరించిన నాడా నర్సింగ్కు క్లీన్చిట్ ఇచ్చింది. దీంతో నర్సింగ్ రియో వెళ్లేందుకు మార్గం సుగమమైంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







