ఆగష్టు 5 న విడుదల కానున్న 'కాకతీయుడు'
- August 01, 2016
వి.సముద్ర దర్శకత్వంలో నందమూరి తారకరత్న కథానాయకుడిగా నటించిన చిత్రం 'కాకతీయుడు'. రేవతి, శిల్పా, యామిని కథానాయికలు. లగడపాటి శ్రీనివాస్ నిర్మాత. ఈనెల 5న కాకతీయుడు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. సమాజానికి మేలు చేసే విద్య, వైద్య రంగాలను వ్యాపారం చేయకూడదని డిమాండ్ చేస్తూ పోరాటం చేసే ఓ వ్యక్తి కథే ఈ చిత్రం అన్నారు. ఇందులో తారకరత్న నటన ఆకట్టుకుంటుందని తెలిపారు. ఇందులో భిన్న పాత్రల్లో కనిపించడానికి తారకరత్న ఎంతో కష్టపడ్డారని పేర్కొన్నారు. 'కాకతీయుడు'లో పుష్కలంగా మాస్ అంశాలు కూడా ఉన్నాయని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి పి.సహదేవ్ స్వరాలు సమకూర్చారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







