ఆగష్టు 5 న విడుదల కానున్న 'కాకతీయుడు'

- August 01, 2016 , by Maagulf
ఆగష్టు 5 న విడుదల కానున్న 'కాకతీయుడు'

వి.సముద్ర దర్శకత్వంలో నందమూరి తారకరత్న కథానాయకుడిగా నటించిన చిత్రం 'కాకతీయుడు'. రేవతి, శిల్పా, యామిని కథానాయికలు. లగడపాటి శ్రీనివాస్‌ నిర్మాత. ఈనెల 5న కాకతీయుడు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. సమాజానికి మేలు చేసే విద్య, వైద్య రంగాలను వ్యాపారం చేయకూడదని డిమాండ్‌ చేస్తూ పోరాటం చేసే ఓ వ్యక్తి కథే ఈ చిత్రం అన్నారు. ఇందులో తారకరత్న నటన ఆకట్టుకుంటుందని తెలిపారు. ఇందులో భిన్న పాత్రల్లో కనిపించడానికి తారకరత్న ఎంతో కష్టపడ్డారని పేర్కొన్నారు. 'కాకతీయుడు'లో పుష్కలంగా మాస్‌ అంశాలు కూడా ఉన్నాయని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి పి.సహదేవ్‌ స్వరాలు సమకూర్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com