డల్లాస్ లో NATS బోర్డు సమావేశం NATS మరింత విస్తరణ దిశగా అడుగులు
- March 12, 2026
టెక్సాస్: డల్లాస్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ బోర్డు కీలక సమావేశం జరిగింది.నాట్స్ నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కిషోర్ కంచర్ల నేతృత్వంలో డాలస్ నగరంలో మొట్టమొదటి కార్యవర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇది కేవలం ఒక సమావేశంగానే కాకుండా, రాబోయే రెండేళ్లలో తెలుగు వారి కోసం నాట్స్ చేయబోయే అద్భుతమైన కార్యక్రమాలకు పునాదిగా నిలిచింది.
30 రాష్ట్రాల నుండి తరలివచ్చిన ప్రతినిధులు
జనవరి 1 నుండి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కిషోర్ కంచర్ల ఆహ్వానం మేరకు, అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కార్య నిర్వాహక సభ్యులు, నాట్స్ చాప్టర్ కోఆర్డినేటర్లు డాలస్‌కు తరలివచ్చారు. సుమారు 60 మందికి పైగా కీలక సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో నాట్స్‌ను అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ, నాట్స్ భవిష్యత్ ప్రణాళికలపై చర్చలు జరిగాయి.
సేవ, సంస్కృతి పరిరక్షణే ధ్యేయం:
"భాషే రమ్యం - సేవే గమ్యం" అనే నినాదాన్ని విధానంగా మార్చుకుని నాట్స్ పని చేస్తుందని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల అన్నారు. రాబోయే రోజుల్లో తన సేవా పరిధిని మరింత విస్తరించాలనే లక్ష్యంతో పనిచేద్దామని కిషోర్ నాట్స్ నాయకులకు పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం ఇలాంటి సమావేశాలు జరుగుతుంటాయని, అయితే ఈసారి కొత్త నాయకత్వం ఉత్సాహవంతములైన కొత్త సభ్యుల చేరికతో సమావేశం మరింత ఫలప్రదంగా జరిగిందని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి తెలిపారు. నాట్స్ ఎప్పుడూ మహిళలకు, పిల్లలకు ప్రాధాన్యత ఇస్తుందని, అందుకే 'మహిళా సంబరాలు', 'బాలల సంబరాలు' వంటి కార్యక్రమాలను మరింత వినూత్నంగా నిర్వహించాలని నాట్స్ బోర్డ్ సభ్యులు బిందు యలమంచిలి తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా కేవలం సామాజిక సంక్షేమం, విద్య,ఆరోగ్యంపై దృష్టి పెడతామని డాక్టర్ అను కొత్త తో పాటు ఇతర నేతలు స్పష్టం చేశారు. కేవలం తెలుగు వారికే కాకుండా, అమెరికాలోని స్థానిక అవసరాలకు కూడా స్పందిస్తామని నాట్స్ ప్రెసిడెంట్ ఎలక్ట్ రాజ్ అల్లాడ వెల్లడించారు.
నాట్స్ పనితీరులో పారదర్శకత మరియు వేగం పెంచడానికి బైలాస్ కమిటీ, హెల్ప్‌లైన్ కమిటీ, ఈసీ సెలెక్షన్ కమిటీ వంటి విభాగాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశంలో అడుగులు పడ్డాయి.
సుదీర్ఘ కాలంగా అమెరికాలో తెలుగు వారికి సేవలు అందిస్తున్న నాట్స్ సంస్కృతిని కాపాడుతూ వస్తున్న నాట్స్ నూతన చైర్మన్ కిషోర్ కంచర్ల ఆధ్వర్యంలో మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని నాట్స్ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.
నాట్స్ ఖ్యాతిని మరింత పెంచేలా పనిచేద్దాం.పదవీ బాధ్యతల స్వీకరణలో కిషోర్ కంచర్ల పిలుపు
మనం సంపాదించే సంపద కన్నా, మనం పంచే ప్రేమ, అందించే సాయమే సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి అని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ బోర్డు ఛైర్మన్ కిషోర్ కంచర్ల అన్నారు. గ్రేప్‌వైన్‌లో జరిగిన నాట్స్ 'మీట్-అండ్-గ్రీట్' కార్యక్రమంలో కిషోర్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం నాట్స్ సభ్యుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. నాట్స్ ఖ్యాతిని మరింత పెంచేలా పనిచేద్దామని నాట్స్ సభ్యులకు కిషోర్ పిలుపునిచ్చారు.
ఈ గౌరవం తనపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని, నాట్స్ బోర్డు సభ్యులకు, డాలస్ మిత్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలో ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినా, మన మూలాలు ఎప్పుడూ తెలుగు మట్టిలోనే ఉంటాయని ఆయన గుర్తుచేశారు. ఒక మనిషి తన కోసం తాను జీవించినప్పుడు కాదు, కష్టాల్లో ఉన్న సాటి మనిషికి చేయూతనిచ్చినప్పుడే గొప్పవాడు అవుతాడు అని కిషోర్ అన్నారు. నాట్స్ పుట్టిందే సాటి తెలుగు వారికి తోడుగా ఉండటానికే అని స్పష్టం చేశారు.
తన రెండేళ్ల పదవీ కాలంలో 'సేవ' అనే పునాది మీదనే నాట్స్ ప్రయాణం సాగుతుందని కిషోర్ కంచర్ల ప్రకటించారు. అమెరికాలో ఉన్నా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా.. కష్టాల్లో ఉన్న తెలుగు వారికి 'మేమున్నాం అని భరోసా ఇచ్చే మొదటి గొంతు నాట్స్ కావాలని ఆయన ఆకాంక్షించారు. ఆపదలో ఉన్న విద్యార్థులకు, అనారోగ్యంతో ఉన్న నిరుపేదలకు, కష్టాల్లో ఉన్న కుటుంబాలకు చేసే చిన్న సాయం వారి జీవితాల్లో పెద్ద వెలుగును నింపుతుందని, ఆ తృప్తి కోసమే అందరం కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.
నాట్స్ కార్యకలాపాలు కేవలం ఈవెంట్స్‌కే పరిమితం కాకుండా, ఒక గొప్ప మానవతా యజ్ఞంలా సాగుతున్నాయని.. దీనిని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు నాట్స్ సభ్యులంతా తనతో కలిసి రావాలని కిషోర్ కోరారు. అందరూ కలిసికట్టుగా నాట్స్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిద్దామని, తెలుగు వారి కీర్తిని దశదిశలా చాటుదామని నాట్స్ నాయకులను ఉత్సాహపరిచారు.
కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా కేవలం సేవనే లక్ష్యంగా పెట్టుకున్న నాట్స్, ఒక క్రమశిక్షణ కలిగిన సైన్యంలా పనిచేస్తుందని నాట్స్ సలహామండలి సభ్యుడు డాక్టర్ కొత్తా శేఖరం పేర్కొన్నారు. ఫ్రిస్కో మేయర్ అభ్యర్థి మార్క్ హిల్ కూడా హాజరయ్యారు. నాట్స్ ఎంతో వైభవంగా నిర్వహించిన ఈ వేడుకలో పలువురు సేవా మూర్తులను పురస్కారాలతో నాట్స్ నాయకులు సత్కరించారు.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్‌లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









