మనోజ్ నిర్మాత అయిన అచ్చిబాబుపై దాడి

- August 02, 2016 , by Maagulf
మనోజ్ నిర్మాత అయిన అచ్చిబాబుపై దాడి

నిర్మాత అచ్చిబాబుపై దాడి చేసిన జూనియర్ ఆర్టిస్టులను తప్పుబట్టారు హీరో మంచు మనోజ్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యులు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆయన డిమాండ్ చేశారు. ఫెడరేషన్ కార్డులు లేనివారు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించాడు. ఈ మేరకు విశాఖలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన మూవీ యూనిట్ దీనికి సంబంధించి వివరాలు వెల్లడించింది. ఫిల్మ్ ఫెడరేషన్‌లో నమోదైన జూనియర్ ఆర్టిస్ట్‌లకు నటించే ఛాన్స్ వుందని, ఇది నచ్చని కొంతమంది గుంపుగా వచ్చి నిర్మాతపై ఎటాక్ చేశారన్నది యూనిట్ వాదన. ఫెడరేషన్‌లో నమోదుకాని ఆర్టిస్ట్‌లకూ అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారని అంటున్నారు. దీనికి ప్రొడ్యూసర్, హీరో నో చెప్పడంతో వాళ్లు ఎటాక్ చేశారని చెబుతున్నారు.
అటు మంచుమనోజ్ ఆరోపణను జూనియర్ ఆర్టిస్టులు ఖండించారు. ప్రొడ్యూసర్ అచ్చిబాబు తమకు బకాయి ఉన్నారని, వాటిని చెల్లించమని మాత్రమే అడిగామని తెలిపారు. జీవనోపాధి కల్పిస్తున్న మంచు మనోజ్ లాంటివారు ఈ రకంగా తమపై తప్పుడు ఆరోపణలు చేయడం ఆవేదనకు గురి చేస్తోందని వారు చెప్పారు. మొదట అందిన వార్తల ప్రకారం ఇందులో నటించేందుకు కొంతమంది జూనియర్ ఆర్టిస్టులతో ప్రొడ్యూసర్ డీల్ కుదుర్చుకున్నాడు. డీల్‌లో భాగంగా 5 లక్షలు మాత్రమే ఇచ్చారని, మరో 10 లక్షలు రావాల్సివుందని చెబుతున్నారు. ఐతే, ఆర్టిస్టులంతా సోమవారం (ఆగస్టు 1న) సెట్‌లో నానా రభస చేశారని సమాచారం. ఈ క్రమంలో మంచు మనోజ్, ఓ నిర్మాత ఆర్టిస్టులపై చేయిచేసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఇరుపక్షాలు ఒకరిపై మరొకరు లోకల్ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. మరి పోలీసుల విచారణలో ఏం తేలుతుందో చూడాలి. మనోజ్ హీరోగా రెండువారాలుగా వైజాగ్‌లోని పరవాడ సమీపంలో ఓ ఫిల్మ్ షూటింగ్ జరుగుతోంది. దీనికి అచ్చిబాబు, ఎస్‌ఎన్‌రెడ్డిలు నిర్మాతలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com