సింగర్ గా మారిన సోనియా

- August 02, 2016 , by Maagulf
సింగర్ గా మారిన సోనియా

"హ్యాపీ డేస్" సినిమాలో మన టైసన్ బాబు "శ్రావ్స్" అంటూ ఎంతో ముద్దుగా పిలుచుకొనే సోనియా అందరికీ గుర్తుండే ఉంటుంది. శ్రావ్స్ కంటే నూడీల్స్ బ్యూటీగా అందరికీ ఎక్కువగా సుపరిచితమైన ఈ భామకి ఆ తర్వాత నటించిన "వినాయకుడు" మినహా మరో హిట్ లేదు. ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్ చేయడానికి కూడా సుముఖత తెలిపి "దూకుడు" సినిమాలో సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ చేసినప్పటికీ అది కూడా పెద్దగా ఉపయోగపడలేదు.
కొంతకాలం విరామం అనంతరం సోనియా నటిస్తున్న తాజా చిత్రం "చిన్ని చిన్ని ఆశ నాలో రేగేనే". ఈ చిత్రంలో అమ్మడు కాస్త గ్లామర్ డోస్ పెంచడంతోపాటు తనలోని మరో టాలెంట్ ను కూడా చూపెట్టనుందట. అమ్మాయిగారికి చిన్నప్పట్నుంచి పాటలు పాడడం అంటే మహా పిచ్చి. అందుకే ఈ చిత్రంలో ఒక పాట పడేందుకు సన్నద్ధమవుతుంది. ఈమె సెట్ లో సరదాగా పాడడం గమనించిన దర్శకుడు ఈ సినిమాలో ఒక పాట పాడమని కోరాడట. అందుకే అమ్మడు కాస్త మొహమాటపడి పాడిందట. మరి ఈ చిత్రం విడుదలయ్యాక సోనియా పాప సింగర్ గా ఫేమస్ అవుతుందో లేక మంచి హిట్ దక్కించుకొని ఆర్టిస్ట్ గా బిజీ అవుతుందో చూడాలి!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com