మిల్క్ రెబ్డి
- July 22, 2015
మిల్క్ రెబ్డి
కావలసిన పదార్ధాలు
పాలు - లీటరు
కుంకుమ పువ్వు - చిటికెడు
పంచదార - ఎనిమిది స్పూన్లు
యాలకుల పొడి - ఒక స్పూను
కెవ్డా ఎసెన్స్ - రెండు చుక్కలు
పిస్తా - ఒక స్పూను
తయారు చేసే విధానం
ముందుగా కుంకుమ పువ్వుని కాసిన్ని గోరువెచ్చని పాలల్లో వేసి కరిగించి పక్కన పెట్టుకోవాలి. మందపాటి బాణలిలోకి పాలు పోసి సిమ్లో తిప్పుతూ సుమారు ఇరవై నిముషాలు మరిగించాలి. తరువాత ప్రతి ఐదు నిముషాలకోసారి తిప్పుతూ పాలు సుమారు పావు లీటరు అయ్యేవరకూ మరిగించాలి. అప్పటికే పాలు ముక్కలు ముక్కలుగా అవుతాయి, అప్పుడు స్టవ్ మీద నుంచి దించి పంచదార, పాలల్లో కరిగించిన కుంకుమ పువ్వు, వేసి కలపాలి. చివరిగా కెవ్డా ఎసెన్స్ రెండు చుక్కలు వేసి, పిస్తా పలుకులు చల్లి ఆరాక ఫ్రిజ్లో పెట్టి అందించాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







