ముంబయి-గోవా రహదారిలో సావిత్రి నదిపై ఉన్న వంతెన కూలింది...
- August 02, 2016
మహారాష్ట్రలో గత రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా మహారాష్ట్ర మహద్ వద్ద ముంబయి-గోవా రహదారిలో సావిత్రి నదిపై ఉన్న వంతెన కూలింది. ప్రమాద సమయంలో వంతెనపై వెళుతున్న రెండు బస్సులు కొట్టుకుపోయాయి. రెండు బస్సుల్లో 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్ అధికారులను ఆదేశించారు. ఘటనాస్థలిలో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం ముంబయి-గోవా రహదారిపై అధికారులు రాకపోకలు నిలిపివేశారు. సావిత్రినదిపై కూలిన వంతెన బ్రిటీష్ కాలం నాటిదని అధికారులు తెలిపారు. పురాతన వంతెన పక్కనే మరో కొత్త వంతెన కూడా ఉంది. కొత్త వంతెనపై నుంచి వెళ్లకుండా రెండు బస్సులు పురాతన వంతెనపైకి ఎందుకెళ్లాయని అధికారులు ఆరాతీస్తున్నారు. ముంబయి నుంచి ప్రత్యేక అధికారుల బృదం ఘటనాస్థలికి బయలుదేరింది. రాయగఢ్ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- కువైట్ లో నీటి భద్రతకు భరోసా..లార్జెస్ట్ వాటర్ ప్లాంట్..!!
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







