'సామి 2'కు శ్రీకారం చుట్టనున్నట్లు దర్శకుడు హరి

- August 02, 2016 , by Maagulf
'సామి 2'కు శ్రీకారం చుట్టనున్నట్లు దర్శకుడు హరి

ఇరుముగన్‌' ఆడియో విడుదల కార్యక్రమంలో భాగంగా విక్రం నటించనున్న కొత్త సినిమాను కూడా ప్రకటించారు. గతంలో హరి దర్శకుడిగా విక్రం నటించిన 'సామి' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగులో బాలకృష్ణ హీరోగా 'లక్ష్మినరసింహ'గా విడుదలై అక్కడా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే 'సామి 2'కు శ్రీకారం చుట్టనున్నట్లు దర్శకుడు హరి ఈ వేదికపై ప్రకటించారు. ఈ సందర్భంగా కథానాయకుడు విక్రం, నిర్మాత శిబు తమీమ్‌ను వేదికపైకి రప్పించి కొత్త సినిమా గురించి ప్రకటించారు. 'సామి' చిత్రంలో విక్రం పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా నటించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సూర్య హీరోగా 'సింగం 2'ను రూపొందిస్తున్నారు హరి. ఆ సినిమా పూర్తికాగానే 'సామి 2'ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com