ఓటీటీలోకి ‘గల్లీ’ వెబ్ సిరీస్
- March 21, 2026
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు (Sudheer Babu) డిజిటల్ దునియాలోకి అడుగుపెడుతున్నారు. గతేడాది ‘జటాధర’ ఆశించిన విజయం అందించకపోయినా, ఇప్పుడు ఒక భారీ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ అనౌన్స్మెంట్ ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇందులో సీనియర్ నటుడు జె.డి. చక్రవర్తి, హన్సిక మోత్వానీ, శ్రద్ధా శ్రీనాథ్, ఆదర్శ్ బాలకృష్ణ, నందగోపాల్, చైతు జొన్నలగడ్డ, ప్రిన్స్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు ఈ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ‘బాహుబలి’ వంటి భారీ చిత్రాలను నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఈ సిరీస్ ని క్రియేట్ చేశారు.‘గల్లీ’లో సుధీర్ బాబు మునుపెన్నడూ చూడని విధంగా, రఫ్ అండ్ మాస్ లుక్‌లో కనిపించారు.
హన్సిక అందంగా కనిపించింది. జేడీ చక్రవర్తి ఒక గ్యాంగ్‌స్టర్ గా కనిపించగా.. శ్రద్ధా శ్రీనాథ్ పోలీసాఫీసర్ పాత్ర పోషించింది. ఎలాంటి డైలాగ్స్ లేకుండా, హిందీ సాంగ్ ని బ్యాగ్రౌండ్ స్కోర్ గా వినిపిస్తూ సాగిన ‘గల్లీ’ ఫస్ట్ లుక్ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. దీనికి శశి సుడిగాల కథ అందించగా.. శ్రీకాంత్ విస్సా, అభిజిత్ పూండ్ల డైలాగ్స్ రాశారు. ప్రసాద్ దేవినేని, శోబు యార్లగడ్డ నిర్మించిన ఈ సిరీస్ త్వరలోనే ప్రైమ్ వీడియోలో వివిధ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
తాజా వార్తలు
- వాట్సాప్‌లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్‌కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్‌లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









