‘ఈ సినిమా మా ‘ప్రేయసిరావే’ రేంజ్లో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను- శ్రీకాంత్
- March 21, 2026
డాక్టర్ రాజేంద్రప్రసాద్, పథ్వీరాజ్, కేదార్ శంకర్, మణి చందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు మహేష్ చంద్ర రూపొందించిన చిత్రం ‘పిఠాపురంలో’. దీనికి ఉప శీర్షిక ‘అలా మొదలైంది’. మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్‌పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి బయటకు వచ్చిన కంటెంట్ ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. ఇక తాజాగా శుక్రవారం నాడు ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి ‘ప్రేయసి రావే’ టీం హీరో శ్రీకాంత్, పృథ్వీ, శివాజీ రాజా, ఎంఎం శ్రీలేఖ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘ప్రేయసి రావే’ కంటే ముందు నేను చేసిన కొన్ని చిత్రాలు సరిగ్గా ఆడలేదు. చంద్ర మహేష్ నాతో తీసిన ‘ప్రేయసి రావే’ అద్భుతమైన విజయం సాధించింది. అందులో పృథ్వీ , శివాజీ రాజా అద్భుతంగా నటించారు. శ్రీలేఖ ఆ సినిమాకు ఇచ్చిన పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అప్పట్లో చంద్ర మహేష్ కొత్త వాడే అయినా గొప్పగా సినిమాని తీశాడు. ఈ ‘పిఠాపురంలో అలా మొదలైంది’ సినిమా కథ గురించి కూడా నాకు మహేష్ చెప్పాడు. మూడు డిఫరెంట్ కథలతో ఈ మూవీని అద్భుతంగా తీశాడని అర్థం అవుతోంది. పిల్లలు, తల్లిదండ్రులు కలిసి ఈ సినిమాని చూడాలి. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని నేను నమ్ముతున్నాను. ‘పిఠాపురంలో అలా మొదలైంది’ మూవీ మా ‘ప్రేయసిరావే’ రేంజ్లో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను . మంచి కంటెంట్, కాన్సెప్ట్ దొరికితే చంద్ర మహేష్, నేను కలిసి సినిమా చేస్తామ”ని అన్నారు.
శివాజీ రాజా మాట్లాడుతూ.. ‘‘ప్రేయసి రావే’ గురించి ఇప్పుడు మాట్లాడుతుండటం ఆనందంగా ఉంది. ఆ మూవీలో శ్రీకాంత్, నా కాంబోకి మంచి పేరు వచ్చింది. శ్రీలేఖ సంగీతం ఆ సినిమాకి ఎంతో కలిసి వచ్చింది. ఆ తరువాత ఆమె చాలా బిజీ అయ్యారు. చంద్ర మహేష్ ఆ టైంలోనే అద్భుతమైన సినిమాల్ని తీశారు. పిఠాపురం అంటేనే ఇప్పుడు ఓ వైబ్ ఉంది. అదే వైబ్ సినిమాలో కూడా ఉంటుంది” అని అన్నారు.
నటుడు పృథ్వీ మాట్లాడుతూ..‘‘ప్రేయసి రావే’లో నాకు అవకాశం ఇచ్చిన చంద్ర మహేష్ కి థాంక్స్. ఆ చిత్రంతో నాకు అవార్డు వచ్చింది. ఆ మూవీ తరువాత నేను మరింత బిజీ అయ్యాను. ‘పిఠాపురంలో అలా మొదలైంది’ మూవీతో చంద్ర మహేష్‌కి బిగ్ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. మెసెజ్‌తో పాటుగా ఎంటర్టైన్మెంట్ కూడా అందించబోతున్నారు. ఈ సినిమాని అందరూ కచ్చితంగా చూడండి’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. శ్రీలేఖ మాట్లాడుతూ..‘మా ‘ప్రేయసిరావే’ చిత్రాన్ని తల్చుకుంటే ఎన్నో మెమోరీస్ అలా గుర్తుకు వస్తుంటాయి. మళ్లీ లాంగ్ గ్యాప్ తరువాత చంద్ర మహేష్ ‘పిఠాపురంలో అలా మొదలైంది’తో కమ్ బ్యాక్ ఇవ్వబోతున్నారు. ట్రైలర్ కూడా అద్భుతంగా ఉంది. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ.. ‘‘ప్రేయసి రావే’ నాకు ఈ లైఫ్ ఇచ్చింది. ఆ టీంతో మా ‘పిఠాపురంలో అలా మొదలైంది’ ట్రైలర్ లాంచ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ ప్రయాణంలో సహకరించిన శ్రీకాంత్ గారు, శివాజీ రాజా గారు, పృథ్వీ గారు, శ్రీలేఖ గారికి థాంక్స్. ‘ప్రేయసి రావే 2’ కథ కూడా రెడీ చేశాను. ‘ప్రేయసి రావే’ చిత్రీకరణ సమయంలో ఎలాంటి ఫీల్ అయితే వచ్చిందో.. ‘పిఠాపురంలో అలా మొదలైంది’ టైంలోనూ అదే ఫీలింగ్ వచ్చింది. ఇప్పటి వరకు మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ క్లైమాక్స్‌కి ఎమోషనల్ అయ్యారు. ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు అద్భుతంగా నటించారు. శ్రీరామ్ గొప్ప డైలాగ్స్ రాశారు. ముగ్గురు నిర్మాతలు నాకెంతో సహకరించారు. ప్రతీ ఇంట్లో జరిగే సంఘటనలతోనే ఈ మూవీని చేశాం. సినిమాని చూస్తే ఇది మా ఇంట్లోనే జరిగినట్టు ఉందే అని ఫీల్ అవుతారు. అందరినీ ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు.
హీరో విరాట్ మాట్లాడుతూ.. ‘‘పిఠాపురంలో అలా మొదలైంది’ మూవీతో నేనెంతో నేర్చుకున్నాను. మహేష్ లాంటి గ్రేట్ దర్శకుడితో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. నా మూడో సినిమా ప్రమోషన్స్‌లోనూ శ్రీకాంత్ గారు పార్ట్ అవ్వడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. రాజేంద్ర ప్రసాద్, పృథ్వీరాజ్ లాంటి సీనియర్లతో నటించడం ఆనందంగా ఉంది. నా ఈ ప్రయాణంలో మీడియా సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ప్రత్యూష మాట్లాడుతూ.. ‘‘పిఠాపురంలో అలా మొదలైంది’లో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మహేష్ కి థాంక్స్. ఆయన నన్ను సొంత కూతురిలా చూసుకున్నారు. మేం కష్టపడి ఓ మంచి మూవీని తీశాం. మా చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
గీత మాట్లాడుతూ.. ‘‘పిఠాపురంలో అలా మొదలైంది’ నటించడం ఆనందంగా ఉంది. ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన నా టీంకి థాంక్స్’ అని అన్నారు.
శ్రీలు మాట్లాడుతూ.. ‘‘పిఠాపురంలో అలా మొదలైంది’లో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మహేష్ కి థాంక్స్. ఆయన వల్లే నేను తెరకు పరిచయం కాబోతోన్నాను. ముగ్గురు అమ్మాయిల కథతో మేం రాబోతోన్నాం. ఈ మూవీని కచ్చితంగా పిల్లలు, తల్లిదండ్రులు కలిసి చూడాలి. ఇలాంటి చిత్రాలకు మీడియా కచ్చితంగా సపోర్ట్ చేయాలి’ అని అన్నారు.
ప్రేమ్ మాట్లాడుతూ.. ‘‘పిఠాపురంలో అలా మొదలైంది’లో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మహేష్ కి థాంక్స్. ఇదే నాకు తొలి చిత్రం. మా సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నిర్మాత దుండిగళ్ళ బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘పిఠాపురంలో అలా మొదలైంది’ అద్భుతంగా వచ్చింది. ఈ మూవీ పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.
నిర్మాత మురళీ కృష్ణ మాట్లాడుతూ.. ‘గోదారి కిట్టయ్యకి అన్ని క్రాఫ్టులు నేనే అయి పని చేశాను. ‘పిఠాపురంలో అలా మొదలైంది’ మూవీని మహేష్ అద్భుతంగా తీశారు. మహేష్ గారి టేకింగ్ చూసి నేనే అడిగి మరీ ఈ మూవీ నిర్మాణంలోకి వచ్చాను. మహేష్ గారికి నేను జీవితాంతం రుణ పడి ఉంటాను’ అని అన్నారు.
డైలాగ్ రైటర్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘‘పిఠాపురంలో అలా మొదలైంది’ కథకి నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్కి తగ్గట్టుగా స్క్రిప్ట్‌ను మార్చాను. ‘ప్రేయసి రావే’లాంటి గొప్ప చిత్రాన్ని చేసిన మహేష్ తో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ మూవీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు.
నిర్మాత ఆకుల సురేష్ పటేల్ మాట్లాడుతూ.. ‘మా ‘పిఠాపురంలో అలా మొదలైంది’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. 2007 నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. శ్రీకాంత్ తో ‘క్షత్రియ’ చేశాను. నేను సర్పంచ్‌గా చేసిన కాలంలో రకరకాల సమస్యల్ని చూశాను. వాటి నుంచి కథను రెడీ చేయించాను. ఆ కథను మహేష్ చంద్ర వద్దకు తీసుకు వచ్చాను. శ్రీరామ్ మూడు, నాలుగు వర్షెన్స్ రాశారు. ఈ మధ్యే సెన్సార్ పూర్తయింది. ప్రస్తుతం తల్లిదండ్రులు పిల్లలతో కలిసి చూసే చిత్రాలు చాలా తక్కువగా వస్తున్నాయి. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది’ అని అన్నారు.
నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ .. ‘మహేష్ చంద్ర గారు అద్భుతమైన సబ్జెక్ట్ కోసం, ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గ కథను రెడీ చేసుకున్నారు. మంచి కథతో ‘పిఠాపురంలో అలా మొదలైంది’ రాబోతోంది. తల్లిదండ్రులకు, పిల్లలకు కనువిప్పులా ఈ సినిమా ఉంటుంది. మూడు డిఫరెంట్ కథలు ఇందులో ఉంటాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
దాసరి పద్మ మాట్లాడుతూ .. ‘మా పాప కోసం‘పిఠాపురంలో అలా మొదలైంది’ గురించి దర్శకుడి వద్దకు వెళ్లాం. అప్పుడే డైరెక్టర్ గారు నాకు కూడా ఓ కారెక్టర్ ఇచ్చారు. మూవీ అద్భుతంగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.
తాజా వార్తలు
- వాట్సాప్‌లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్‌కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్‌లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









