చార్మింగ్ స్టార్ శర్వా బైకర్ ట్రైలర్ పై ప్రశంసలు కురిపించిన రెబల్ స్టార్ ప్రభాస్
- March 23, 2026
రెబల్ స్టార్ ప్రభాస్, చార్మింగ్ స్టార్ శర్వా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ బైకర్ ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించడం సినిమాపై మరింత బజ్ పెంచింది. తాజాగా విడుదలైన ఈ థియేట్రికల్ ట్రైలర్ థియేటర్లలో ప్రీమియర్ అవ్వడంతో పాటు ఆన్లైన్లో కూడా అద్భుతమైన స్పందన అందుకుంది.విజువల్ ప్రెజెంటేషన్, ఎమోషనల్ డెప్త్, టెక్నికల్ క్వాలిటీ ప్రేక్షకులను కట్టిపడేశాయి.
ట్రైలర్ చూసిన ప్రబాస్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, “ట్రైలర్ వైబ్ చాలా నచ్చింది… చాలా ఎంగేజింగ్‌గా ఉంది. శర్వా, UV Creations, మొత్తం టీమ్‌కు ఆల్ ది బెస్ట్. ఏప్రిల్ 3న భారీ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను”.
ప్రభాస్ నుంచి అభినందనలు రావడంతో సినిమాపై ఉన్న హైప్ మరింత పెరిగింది.
ఈ ట్రైలర్లో స్పోర్ట్స్ డ్రామా ఎనర్జీ, ఎమోషనల్ ఎలిమెంట్స్, రగ్డ్ విజువల్ టోన్.. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. దర్శకుడు అభిలాష్ రెడ్డి కథని అద్భుతంగా ప్రెజెంట్ చేసిన తీరు ప్రత్యేకంగా ప్రశంసలు అందుకుంటోంది.
బైకర్ లో శర్వా మోటార్‌సైకిల్ రేసర్‌గా ఒక ఎనర్జిటిక్, ఇంటెన్స్ పాత్రలో కనిపించబోతున్నారు. సీనియర్ నటుడు రాజశేఖర్ కథలో భావోద్వేగాన్ని నడిపించే కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్గా మాళవిక నాయర్ నటిస్తోంది.బైకర్ చిత్రం ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్‌లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్‌కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









