తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- March 23, 2026
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గిగ్ వర్కర్ల బిల్లు, తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుతోపాటు తల్లిదండ్రులను ఆదరించని ఉద్యోగుల వేతనాల కట్ బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
విద్వేష ప్రసంగాలు, హేట్ క్రైమ్‌ల నివారణకు “తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026”కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇకనుంచి మత సామరస్యాన్ని భంగం కలిగించే పోస్టులు, అల్లర్లు ప్రేరేపించే ప్రసంగాలపై కఠిన చర్యలు తీసుకోనుంది.
గిగ్ వర్కర్ల కోసం “తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ యాక్ట్ 2026” బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో 4.2లక్షల గిగ్ వర్కర్లకు రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ, వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేయనుంది. గిగ్ వర్కర్లకు చట్టబద్ధ గుర్తింపు, హక్కులకు కొత్త చట్టం రక్షణ కల్పించనుంది.
న్యాయవాదుల రక్షణ కోసం “తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు”కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. వామనరావు హత్య ఘటన నేపథ్యంలో అడ్వకేట్ల భద్రతపై ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
కుల గణనపై నిపుణుల కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ నివేదికపై సబ్ కమిటీ పరిశీలన చేయనుంది. అదేవిధంగా రోహిత్ వేముల చట్టం రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కమిటీ పని ప్రారంభించనుంది.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 స్వాధీనం పై కీలక నిర్ణయం కేబినెట్ తీసుకుంది. రూ.15,000 కోట్లతో ఎల్ అండ్ టీ నుంచి మెట్రో ప్రాజెక్టు తీసుకునే ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్ణయించింది. HMRL ను నోడల్ ఏజెన్సీగా నియమించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ఇచ్చింది.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్‌లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్‌కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









