ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- March 24, 2026
కొలంబియా: దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. 110 మంది సైనికులతో వెళ్తున్న లాక్‌హీడ్ మార్టిన్ హెర్క్యులస్ సి-130 విమానం.. ప్యూర్టో లెగుయిజామో పట్టణం నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో కూలిపోయింది. విమానం కూలిపోయిన వెంటనే మంటలు అంటుకొని దట్టమైన పొగలు వ్యాపించాయి. ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
రక్షణ మంత్రి పెడ్రో సాంచెజ్ ఈ ఘటన పై మాట్లాడుతూ.. పెరూ సరిహద్దులో కొలంబియా దక్షిణ అమెజాన్ ప్రాంతంలోని ప్యూర్టో లెగుయిజమో నుంచి సైనికులను తరలిస్తున్న విమానం టేకాఫ్ అవుతుండగా కూలిపోయిందని తెలిపారు. అయితే ఈ ఘటన దేశానికి తీవ్ర విషాదకరం అని ఆయన అన్నారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఆయన పేర్కొన్నారు.
ఇదిలాఉంటే..స్థానిక మీడియా పంచుకున్న వీడియోలో .. విమాన ప్రమాదం జరిగిన ప్రదేశంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సైనికులను తీసుకెళ్తున్న ట్రక్కులు ఆ ప్రాంతానికి వెళ్లడం కనిపించింది.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్‌లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్‌కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









