వ్యాట్ ఎగవేత..వ్యాపారవేత్తకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!

- March 24, 2026 , by Maagulf
వ్యాట్ ఎగవేత..వ్యాపారవేత్తకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!

మనామాః బహ్రెయిన్‌లోని ఉన్నత క్రిమినల్ కోర్టు..వ్యాట్ ఎగవేతకు పాల్పడిన ఒక వ్యాపారవేత్తకు ఐదు సంవత్సరాల జైలుశిక్ష మరియు BHD 247,559.551 జరిమానా విధించింది. ఇక ఇప్పటివరకు చెల్లించని వ్యాట్ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని మరియు శిక్షాకాలం పూర్తయ్యాక అతడిని దేశం నుండి బహిష్కరించాలని  కోర్టు ఆదేశించింది.
ఆహార రిటైల్ షాపుల యజమాని ఒకరు నేషనల్ బ్యూరో ఫర్ రెవెన్యూ (NBR)కి తప్పుడు పత్రాలు సమర్పించాడు. దిగుమతి రికార్డులను నిర్వహించడంలో విఫలమయ్యాడు. ఇలాంటి పద్ధతుల ద్వారా వ్యాట్ ఎగవేసినట్లు దోషిగా  తేలాడు. పైగా నోటీసు జారీ చేసినప్పటికీ నిందితుడు కోర్టుకు హాజరు కాలేదు.  

విచారణలో, నిందితుడు వ్యాట్ ను తప్పించుకునేందుకు, చెల్లించాల్సిన మొత్తాలను ఉద్దేశపూర్వకంగా తక్కువగా చూపి, తప్పుడు వ్యాట్ రిటర్న్‌లను సమర్పించినట్లు వెల్లడైంది. పన్ను ఎగవేత ఆరోపణలతో “తవాసుల్” యాప్ ద్వారా అందిన ఒక ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అధికారులు కంపెనీ శాఖలలో తనిఖీలు నిర్వహించారు.  
వ్యాపారవేత్త తప్పుడు పత్రాలను సమర్పించాడని, వ్యాట్ మినహాయింపులను సక్రమంగా క్లెయిమ్ చేయలేదని, ఇన్‌వాయిస్‌లను జారీ చేయడంలో విఫలమయ్యాడని,  దిగుమతులు, సేవలకు సంబంధించిన క్రమబద్ధమైన అకౌంటింగ్ రికార్డులను నిర్వహించలేదని అదికారులు సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుకు సమర్పించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com