'చందమామ కథలు' దర్శ కుడు తో రాజశేఖర్‌...

- August 04, 2016 , by Maagulf
'చందమామ కథలు' దర్శ కుడు తో  రాజశేఖర్‌...

కొంత విరామంతో రాజశేఖర్‌ కెమెరా ముందుకు వస్తున్నారు. ఇదివరకు 'చందమామ కథలు', 'గుంటూర్‌ టాకీస్‌' సినిమాల్ని రూపొందించిన ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో హీరోగా నటించేందుకు ఆయన అంగీకరించారు. ఈ విషయాన్ని ప్రవీణ్‌ సత్తార్‌ తెలియజేస్తూ ''ఈ చిత్రంలో రాజశేఖర్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రతో, స్టయిలిష్‌ లుక్‌లో కొత్తగా కనిపిస్తారు. స్ర్కిప్ట్‌ రెడీ అయ్యింది. ఈ నెల చివరి వారంలో సినిమా ప్రారంభమవుతుంది. త్వరలోనే ఈ చిత్రానికి పనిచేసే తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేస్తాం'' అని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com