కేటీ జలీల్‌ను సౌదీ పంపనున్న కేరళ....
- August 04, 2016
సౌదీ అరేబియాలో ఉద్యోగం కోల్పోయి అవస్థలు పడుతున్న కేరళీయుల పరిస్థితిని తెలుసుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి కేటీ జలీల్‌ను సౌదీ పంపనుంది. రాష్ట్ర మంత్రివర్గం బుధవారం జరిగిన సమావేశంలో మంత్రి జలీల్‌ను, ప్రత్యేక కార్యదర్శి వీకే బేబీని సౌదీ పంపనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 200 మంది కేరళీయులు లేబర్ క్యాంపుల్లో పని చేస్తున్నారన్నారు. ఇప్పుడు వారు ఉద్యోగం కోల్పోయి తినడానికి కూడా ఏమి లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే అక్కడికి వెళ్తున్నట్లు జలీల్ తెలిపారు. .
సౌదీలో చమురు ధరలు తగ్గడం వల్ల వ్యాపారం నష్టాల్లో కూరుకు పోవడంతో అక్కడి సంస్థలు కార్మికులకు సరిగా వేతనాలు ఇవ్వడం లేదు. దాదాపు 10వేల మంది భారతీయులు నిరుద్యోగులుగా మారారు.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







