చెన్నై-దుబాయ్ మార్గంలో విమాన సర్వీసులు రద్దు
- August 04, 2016
దుబాయ్ విమానాశ్రయంలో కేరళలోని తిరువనంతపురం నుంచి వెళ్లిన ఎమిరేట్స్ విమానం నిన్న క్రాష్ ల్యాండ్ అయిన నేపథ్యంలో నేడు చెన్నై-దుబాయ్ మార్గంలో విమాన సర్వీసులు రద్దు చేశారు. నిన్న దాదాపు 300 మంది అదృష్టవశాత్తు తృటిలో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన సంగతి తెలిసిందే. ఈరోజు జెట్ ఎయిర్‌వేస్, ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు విమానాలు చెన్నై-దుబాయ్ మార్గంలో ప్రయాణాన్ని ఉదయం రద్దు చేసుకున్నాయని చెన్నై విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. అలాగే స్పైస్ జెట్ కూడా ఈ మార్గంలో విమానాలు రద్దు చేసినట్లు తెలిపింది. విమానాల రద్దు కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమించాలని ఆయా ఎయిర్‌లైన్స్ సోషల్‌మీడియా ద్వారా ప్రకటించాయి. నిన్న దుబాయ్‌లో ఎమిరేట్స్ విమానం రన్‌వేపై క్రాష్ ల్యాండ్ అయ్యి ప్రయాణికులు విమానం నుంచి బయటపడిన కొద్ది క్షణాల్లోనే పూర్తిగా మంటల్లో చిక్కుకుంది.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







