డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..

- April 02, 2026 , by Maagulf
డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..

హైదరాబాద్: తెలంగాణలో డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ చివరి ఏడాది.. ఎంటెక్, ఎంసీఏ, ఎంకాం, ఎంఏ, ఎమ్మెస్సీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారు ప్రతి నెలా రూ.9 వేలు పొందే అవకాశం కల్పిస్తోంది. అర్హులైన విద్యార్థులందరూ ఈ పథకాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంతకీ ఇది ఏ పథకం అంటే.. ప్రతిభ గల విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కాలర్‌షిప్ పథకం’. దీనికి ఎంపికైన విద్యార్థులు ప్రతి నెల రూ.9 వేల స్కాలర్‌షిప్ పొందవచ్చని తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు తెలిపారు.

ముఖ్య నిబంధనలు, అర్హతలు:

  • ఏజ్ లిమిట్: 18-25 ఏళ్ల లోపు విద్యార్థులు ఈ పథకానికి అర్హులు.
  • విద్యార్హత: తప్పనిసరిగా పది, ఇంటర్/ఐటీఐ/పాలిటెక్నిక్ పూర్తిచేసుకుని.. డిగ్రీ చదువుతున్న వారు అర్హులు.
  • చివరి ఏడాది విద్యార్థులు మాత్రమే: డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • కోర్సులు: బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంఏ, ఎమ్మెస్సీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. అలాగే డిగ్రీలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ కోర్సులతో పాటు బీఫార్మసీ, బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులు.
  • స్కాలర్షిప్: ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.9 వేల చొప్పున స్కాలర్‌షిప్ ఇస్తారు.
  • కుటుంబ ఆదాయం: విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.12 లక్షలలోపు ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు విధానం: ఆసక్తి గల విద్యార్థులు ‘ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్’ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • సహాయం కోసం: మరిన్ని వివరాలకు ఫోన్ నెంబరు 1800116090 సంప్రదించాలని కోరారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com