100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- April 02, 2026
మస్కట్: ఒమన్ సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ తన పరిధిలోని వివిధ రంగాలలో సాధించిన అత్యంత ముఖ్యమైన విజయాలు, కీలక పనితీరు సూచికలు, భవిష్యత్ ప్రణాళికలు మరియు వ్యూహాత్మక ఆకాంక్షలను వెల్లడిస్తూ నివేదిక విడుదల చేసింది. సామాజిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మరియు సమగ్ర రక్షణ, సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అచంచలమైన నిబద్ధతను సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ లైలా అహ్మద్ అల్ నజ్జర్ కొనియాడారు. ఈ సామాజిక రక్షణ విధానాలలో గుణాత్మక పరివర్తనను తీసుకువచ్చిందని పేర్కొన్నారు. దీనికి నిదర్శనంగా 178 మిలియన్ల ఒమన్ రియాల్స్ (OMR) వ్యయంతో లక్ష మందికి పైగా పౌరులకు సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
అలాగే, వివిధ గవర్నరేట్‌లలో వివాహ నిధులను ఏర్పాటు చేయడం, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ సంరక్షణ మరియు పునరావాస కేంద్రం నిర్మాణానికి 7 మిలియన్ల ఒమన్ రియాల్స్ (OMR) కేటాయించడం, వికలాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేయడం, వికలాంగులకు అందించే సేవలను పర్యవేక్షించడానికి మంత్రిత్వ శాఖ నిర్మాణంలో అండర్ సెక్రటరీ స్థాయిలో ఒక కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ, తన 2026 ప్రణాళికలో భాగంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులు మరియు కార్యక్రమాలను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. వీటిలో ముఖ్యంగా దివ్యాంగుల హక్కుల చట్టానికి సంబంధించిన కార్యనిర్వాహక నిబంధనల జారీ, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ సంరక్షణ మరియు పునరావాస కేంద్రానికి శంకుస్థాపన, అనేక ప్రత్యేక పునరావాస కేంద్రాలు మరియు యూనిట్ల ఏర్పాటు, దివ్యాంగుల జాతీయ రిజిస్ట్రీ ప్రాజెక్టును పూర్తి చేయడం, పిల్లలు మరియు బాలలకు సంబంధించిన పలు చట్టాల సమీక్ష, అలాగే మహిళా నాయకత్వ సాధికారతను పెంపొందించడం, వృద్ధుల కోసం అభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి గుణాత్మక కార్యక్రమాల ప్రారంభం కానున్నాయి.
సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ, వికలాంగుల వ్యవహారాల అండర్ సెక్రటరీ అయిన డాక్టర్ అబ్దుల్లా హమూద్ అల్ హర్తి మాట్లాడుతూ.. వికలాంగుల పునరావాసం మరియు వారిని కార్మిక మార్కెట్‌లో ప్రత్యే కార్యక్రమాలను ప్రారంభించి, అమలు చేయడం ద్వారా ఆర్థిక మరియు సామాజిక జీవితంలో వారి భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి మంత్రిత్వ శాఖ తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందని వివరించారు. పర్యాటక రంగంలో దివ్యాంగులకు సాధికారత కల్పించేందుకు, మంత్రిత్వ శాఖ ఒమ్రాన్ గ్రూప్‌తో కలిసి 'మహూబ్' (ప్రతిభావంతులు) కార్యక్రమం రెండవ విడతను ప్రారంభించిందని, ఇందులో 11 మంది శిక్షణార్థులు పాల్గొనగా, వారిలో ఐదుగురు చురుకుగా కార్మిక మార్కెట్‌లో ప్రవేశించారని, తద్వారా కీలక రంగాలలో ఈ వర్గం ఉనికిని బలోపేతం చేశారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్‌కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









