కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- April 03, 2026
కువైట్: ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో వ్యాపార, కుటుంబ మరియు పర్యాటక వీసాలతో సహా అన్ని రకాల సందర్శన వీసాల గడువును మరో నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ప్రస్తుత పరిస్థితులు మరియు విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేయబడటం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు, మంత్రిత్వ శాఖలోని భద్రతా మీడియా డైరెక్టర్ కల్నల్ ఒత్మాన్ అల్-ఘరీబ్ తెలిపారు.
ఈ సమయంలో సందర్శకులు మరియు వారి స్పాన్సర్లు ఎటువంటి న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోకుండా నిరోధించడమే లక్ష్యంగా.. మానవీయ కోణంలో ఈ చర్య తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
వ్యక్తులు స్వయంగా 'రెసిడెన్స్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్' ను సందర్శించాల్సిన అవసరం లేకుండానే, అన్ని సందర్శన వీసాలు ఆటోమెటిక్ గా రెన్యూవల్ అవుతాయని అల్-ఘరీబ్ తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







