విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- April 03, 2026
న్యూ ఢిల్లీ: విమాన ప్రయాణం చేసే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక చేదు వార్త వినిపించింది. కేవలం మూడు వారాల క్రితం ప్రయాణికుల ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన ఒక కీలక నిబంధనను ఇప్పుడు ప్రభుత్వం అకస్మాత్తుగా రద్దు చేసింది. విమానాల్లో కనీసం 60 శాతం సీట్లను ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణికులకు కేటాయించాలని గత నెలలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.అసలు ఆ రూల్ ఏమిటి? సాధారణంగా మనం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు, వెబ్ చెక్-ఇన్ సమయంలో నచ్చిన సీటును ఎంచుకోవాలంటే విమానయాన సంస్థలు అదనపు బాదుడు మొదలుపెడతాయి. కిటికీ పక్కన సీటు కావాలన్నా లేదా ముందు వరుసలో కూర్చోవాలన్నా భారీగా వసూలు చేస్తాయి. ప్రస్తుతం కేవలం 5 నుంచి 15 శాతం సీట్లు మాత్రమే ఉచితంగా అందుబాటులో ఉంటున్నాయి.దీనిని అరికట్టడానికి, ప్రతి విమానంలో 60 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలని మార్చి 17న ప్రభుత్వం ఆదేశించింది.
దీనివల్ల సామాన్య ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గుతుందని అందరూ భావించారు. ఈ నిబంధనను విమానయాన సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ వంటి సంస్థలు ఉన్న ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్’ (FIA), ఆకాశ ఎయిర్ ప్రభుత్వానికి లేఖలు రాశాయి.సీట్ సెలెక్షన్ ఫీజును రద్దు చేస్తే, ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి బేస్ ఫ్లైట్ టికెట్ ధరలను పెంచాల్సి వస్తుందని వారు వాదించారు. విమాన ఇంధన ధరలు (ATF) పెరగడం, అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల విమాన రంగం ఇప్పటికే ఇబ్బందుల్లో ఉందని, ఇలాంటి నిర్ణయాలు మరింత భారం వేస్తాయని వారు వివరించారు.ఈ విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం, ప్రస్తుతానికి ఈ ఉత్తర్వులను పక్కన పెడుతున్నట్లు స్పష్టం చేసింది. ప్రయాణికులకు ఊరటనిచ్చే అంశాలు అయితే, 60 శాతం ఉచిత సీట్ల నిబంధనను రద్దు చేసినప్పటికీ, మార్చి 17 నాటి సర్క్యులర్‌లోని ఇతర అంశాలను మాత్రం ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఒకే టికెట్ (PNR)పై బుక్ చేసుకున్న కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు వీలైనంత వరకు పక్కపక్క సీట్లు కేటాయించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







