ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- April 04, 2026
దోహార్: పిల్లల భద్రతను నిర్ధారించడానికి, తల్లిదండ్రులు మరియు సంరక్షకులు పిల్లల భద్రతా మార్గదర్శకాలను పాటించాలని, వారిని ప్రమాదాల నుండి రక్షించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) సూచించింది.
ఈ మేరకు సోషల్ మీడియాలో పంచుకున్న ఒక పోస్ట్‌లో.. పిల్లలు మునిగిపోకుండా నిరోధించడానికి స్విమ్మింగ్ పూల్స్‌లో ఉన్నప్పుడు వారిని పర్యవేక్షించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను వాహనాల్లో ముందు సీట్లలో కూర్చోబెట్టడం, వాహనాల్లో వారిని ఒంటరిగా వదిలివేయడం మరియు ఆట, వినోద ప్రదేశాలలో వారిని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని కూడా మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
అత్యవసర పరిస్థితులలో పిల్లలతో ప్రశాంతంగా, అవగాహనతో వ్యవహరించాలని సూచించింది. అలాగే వారి వయస్సుకు తగిన ఎలక్ట్రానిక్ గేమ్‌లను ఎంచుకునేలా చూడాలని తల్లిదండ్రులకు సలహా ఇచ్చింది.
ఈ మార్గదర్శకాలను పాటించడం వల్ల ప్రమాదాలను తగ్గించి, పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించవచ్చని MOI పేర్కొంది.
తాజా వార్తలు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!









